ఎన్టీఆర్ మరో ప్యాన్ ఇండియా మూవీ.. కోట్లు కురిపించిన డైరెక్టర్‌తో సూపర్ స్కెచ్
టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవకుశ, అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలు, డైరెక్టర్ల ఎంపికలో పక్కాగా అడుగులు వేస్తున్నారు. చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న యంగ్ టైగర్ మూడో సినిమాపై పక్కా స్కెచ్ వేస్తున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి.. దేశవ్యాప్తంగా కోట్ల రూపాయల కనకవర్షాన్ని కురిపించిన దర్శకుడితో మూవీని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. త్వరలోనే ఈ సినిమా వివరాలు బయటకు అధికారికంగా వెల్లడయ్యే అవకాశం ఉంది. ఆ డైరెక్టర్ ఎవరంటే..
Recommended Video

బాహుబలి హిస్టారిక్ మూవీ తర్వాత
బాహుబలి హిస్టారిక్ విజయం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ, హీరోల రేంజ్ ఊహించనంతగా పెరిగిపోయింది. ప్రభాస్ సాహోతో, చిరంజీవి సైరాతో, ప్యాన్ ఇండియా మూవీతో హిందీ ప్రేక్షకులకు చేరవయ్యారు. ఆ తర్వాత ఎన్టీఆర్, రాంచరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి యువ హీరోలు తమ మార్కెట్‌ను విస్తరించే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు.

RRRతో ఎన్టీఆర్ ప్యాన్ ఇండియా మూవీ
ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న RRR మూవీతో ఎన్టీఆర్, రాంచరణ్ ప్యాన్ ఇండియా మూవీ జాతకాన్ని పరీక్షించుకొంటున్నారు. ఇప్పటికే RRR మూవీ దేశవ్యాప్తంగా అంచనాలు పెంచింది. ఆ సినిమా రేంజ్ గురించి ఎలాంటి సందేహాలు పెట్టుకోనవసరం లేదనే వాదన జాతీయ స్థాయిలో వినిపిస్తున్నది.

త్రివిక్రమ్‌తో ఢిల్లీకి పోయి రావాలని..
ఇదే ఊపులో త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీఆర్ అయిననూ పోయి రావాలే హస్తినకు అనే చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న ఈ చిత్రం ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉండాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా కాస్త వెనక్కు వెళ్లింది. లాక్‌డౌన్ తర్వాత త్రివిక్రమ్, ఎన్టీఆర్ సినిమా సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇటీవల ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా ఆగిపోయే అవకాశం ఉందనే వార్తలను యూనిట్ ఖండించింది.

ప్రశాంత్ నీల్‌తో మూవీ
ఇక మరో ప్యాన్ ఇండియా మూవీకి ఎన్టీఆర్ రంగం సిద్దం చేస్తున్నారు. కేజీఎఫ్ సినిమాతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించిన ప్రశాంత్ నీల్‌తో సినిమాను చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇటీవలే ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కలిసి తమ ఫ్యూచర్ ప్రాజెక్టుపై చర్చలు జరిపారట. ప్రశాంత్ నీల్ చెప్పిన లైన్ నచ్చడంతోపాటు సినిమా చేయడానికి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

కల్యాణ్ రామ్, మైత్రీ మూవీస్ సంయుక్తంగా
కథ విషయానికి వస్తే ఎన్టీఆర్ ఇమేజ్‌కు ఏ మాత్రం తీసిపోని విధంగా యాక్షన్ మూవీగా తెరకెక్కనున్నది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మాస్ అవతారంలో ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నట్టు తెలిసింది. త్రివిక్రమ్ సినిమా పూర్తి కాగానే, అలాగే కేజీఎఫ్2 తర్వాత ప్రశాంత్ నీల్‌తో సినిమాను పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్‌తో రూపొందే ఈ చిత్రాన్ని నందమూరి కల్యాణ్ రామ్ నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లనున్నారు.


Click it and Unblock the Notifications











