Junior NTR: జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీకీ ఓటేశాడా? అలా వేయమని కూడా చెప్పాడా? ప్రూఫ్ వీడియోలు వైరల్!

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల పండుగ ప్రారంభం అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రశాంతంగా ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఎంతో ఉత్కంఠగా అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలని చూస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల్లో తామే గెలిచేందుకు అన్ని పార్టీలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి. మరోవైపు ప్రజలు అంతా ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అలాగే సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు ఓటు వేసేశారు.

ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి మరీ వెళ్లి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లిహిల్స్‌లోని ఓబుల్‌ రెడ్డి స్కూల్‌ బూత్ నెంబర్ 150లో ఓటు వేశాడు. ఆయన భార్య లక్ష్మీ ప్రణతి, తల్లి కూడా అక్కడే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ముగ్గురూ కలిసి వచ్చి.. దాదాపు అరగంట పాటు పోలింగ్ కేంద్రం ఆవరణలో నిల్చున్నారు. క్యూ లైన్ లో ఉండి మరీ ఓటు వేసిన ఆయన తిరిగి వెళ్లేటప్పుడు అందరికీ హాయ్ చెప్పారు.

Recommended Video

Telangana Polling 2023 : దేవర లుక్ లో Jr NTR భార్య, తల్లి తో కలిసి ఓటేసిన తారక్ | Telugu OneIndia

Junior NTR Vote For Congress And Videos Goes Viral Check Details

ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. ఆయన ఏ పార్టీకీ ఓటు వేశారో తెలిసిపోయిందంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడీయాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకే ఓటు వేశారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా అందరూ అదే గుర్తుకు ఓటు వేయాలని కూడా పోలింగ్ కేంద్రం వద్ద సూచించినట్లు చెబుతున్నారు. దానికి ఈ వీడియోలే ప్రూఫ్ అంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ వీడియోల్లో ఏముందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Junior NTR Vote For Congress And Videos Goes Viral Check Details

జూనియర్ ఎన్టీఆర్ తన భార్య, తల్లితో పాటు కలిసి లైన్ లో ఉండగా.. తనకు తెలిసిన వాళ్లు ఎవరో వస్తే చేయి పైకెత్తి మరీ ఉపాడు. అయితే ఈ వీడియోనే నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈయన చేయి పైకెత్తి చూపించిన విధానంలో హస్తం గుర్తు ఉండగా.. ఆయన కావాలనే అలా చూపించారని నెటిజెన్లు చెప్పుకొస్తున్నారు. క్లియర్ గా కాంగ్రెస్ గుర్తుకే తాను ఓటేయబోతున్నట్లు, ప్రజలు కూడా అదే గుర్తుకు ఓటేయాలని సూచిస్తున్నట్లు వివరిస్తున్నారు.

అయితే ఈ వీడియోలు చూస్తున్న ప్రతీ ఒక్కరూ.. మా గుర్తు కాంగ్రెస్ కే అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమే మా అభిమాన నటుడు ఎవరికి వేయమంటే వారికే ఓటేస్తానం అని కూడా చెబుతున్నారు. మీరూ ఓసారి ఆ వీడియో చూసేయండి. నిజంగానే ఆయన అలా హింట్ ఇచ్చారా.. లేక కాజ్యువల్ గా చేయి ఊపితే అలా అంటుకున్నారా అనేది కామెంట్లు రూపంలో తెలియజేయండి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X