అప్పుడే 8 ఏళ్లు.. జీవితంలోకి మరెన్సో వసంతాలు రావాలి.. భార్యతో జూనియర్ ఎన్టీఆర్
వరుస విజయాలు, విభిన్నమైన పాత్రలతో జూనియర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నాడు. అతని విజయంలో ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి భాగమై జీవితాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. లక్ష్మీ ప్రణతితో ఎన్టీఆర్ వివాహం జరిగి మే 5వ తేదీకి ఎనిమిదేళ్లు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించారు.
లక్ష్మీ ప్రణతితో నా జీవిత భాగస్వామ్యానికి అప్పుడే 8 ఏళ్లు నిండాయి. మరెన్నో ఏళ్లు ముందుకు సాగాలని భగవంతుడిని కోరుకొంటున్నాను అని ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ ఫోటోను పెట్టారు. కాగా, ఎన్టీఆర్ వివాహా వార్షికోత్సవం దినాన్ని పురస్కరించుకొని అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అన్నా, వదిన అంటూ అప్యాయంగా వారికి విషెస్ చెప్పారు. మీ ఇద్దరి అన్యోన్యమైన జంట అని ప్రశంసిస్తున్నారు.

కాగా, ఇటీవల ఎన్టీఆర్ గాయపడ్డారు. చేతికి గాయం కావడంతో RRR షూటింగ్‌కు దూరంగా ఉంటున్నారు. తన వివాహ వార్షికోత్సవం రోజున చేతికి కట్టుతో భార్యతో ఫోటో దిగి ఇన్స్‌టాగ్రామ్‌లో పెట్టారు.


Click it and Unblock the Notifications











