జూనియర్ పవన్ కల్యాణ్ హీరోగా చింతామణి సొంత మొగుడు.. సామాజిక స్పృహ, సందేశంతో..

శ్రీ స్కందాగ్రజ పతాకంపై జూనియర్ పవన్ కళ్యాణ్ రాజేంద్ర ప్రసాద్, మగువ ఫేమ్ మధు ప్రియ జంటగా శివ నాగేశ్వరావు వీరేళ్ళ స్వీయ దర్శకత్వంలో నిర్మితమవుతున్న చిత్రం చింతామణి సొంత మొగుడు. ఈ చిత్రం విడుదలకు ముస్తాబవుతున్న సందర్బంగా హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో చిత్ర యూనిట్ చిత్ర ట్రైలర్‌ను, పాటలను ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నిర్మాత ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ ట్రైలర్‌ను విడుదల చేయగా,ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి పాటలను విడుదల చేశారు.

నిర్మాత, ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ..ట్రైలర్ చాలా బాగుంది. ఒక పెద్ద స్టార్ పోలికలు ఉన్న వ్యక్తి ఇందులో ప్రధాన పాత్ర చేస్తున్నాడు. ఈ కథకు తను మంచి యాప్ట్ అయి ఉంటారు. చిన్న సినిమాలు వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది అని కోరుకుంటున్నాను. అలాగే ఈ చిత్ర దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ‌కు, చిత్ర యూనిట్ కు అల్ ద బెస్ట్ అన్నారు.

 Junior Pawan Kalyans Chintamani Sonta Mogudu set to release soon

ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసిరెడ్డి మాట్లాడుతూ.. మోహన్ గౌడ్ వచ్చి మాకు ఈ ట్రైలర్ చూపించడం జరిగింది. తక్కువ బడ్జెట్‌లో మంచి అవుట్‌పుట్ ఉన్న సినిమా తీశారు. దీనికోసం ఎంత హార్డ్ వర్క్ చేశారో అనేది నాకు తెలుస్తుంది. చిన్న సినిమాలకు మేము ఎప్పుడూ అండగా ఉంటాము. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా గొప్ప విజయం సాధించి చిత్ర దర్శక,నిర్మాతకు చిత్ర యూనిట్ అందరికీ మంచి పేరు రావాలని అన్నారు.

చిత్ర దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ మాట్లాడుతూ...శ్రీ స్కందాగ్రజ బ్యానర్‌పై నిర్మించి, దర్శకత్వం వహిస్తున్న చిత్రం చింతామణి సొంత మొగుడు. హీరోగా రాజేంద్ర ప్రసాద్ జూనియర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ రూపంతోపాటు వాయిస్ కూడా అలాగే ఉండటంతో అందరూ తనని జూనియర్ పవన్ కళ్యాణ్ అని పిలుస్తుంటారు. షూటింగ్ ఫైనల్ దశలో ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి మమ్మల్ని ప్రోత్సహించాలని మనస్పూర్తిగా కోరుతున్నాను.

 Junior Pawan Kalyans Chintamani Sonta Mogudu set to release soon

చిత్ర హీరో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. సామాజిక స్పృహ, సమాజం పట్ల బాధ్యత కలిగి సినిమా రంగంపై మక్కువతో మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. తపనతో ప్రొడ్యూసర్, డైరెక్టర్‌గా రెండు బాధ్యతలను దర్శక, నిర్మాత శివ నాగేశ్వరావు వీరేళ్ళ చేపట్టారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా చూడాల్సిన సినిమా ఇది. ఇందులో ప్రతి సన్నివేశం ఎంతో హృదయానికి హత్తుకునే విధంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలు సమాజానికి చాలా అవసరం అని అన్నారు

నటీనటులు: రాజేంద్రప్రసాద్ (జూనియర్ పవన్ కళ్యాణ్), మధు ప్రియా (మగువా ఫేమ్), జబర్దస్త్ ఫేమ్ అప్పారావు, చిట్టి బాబు, ఆనంద్ భారతి, రమేష్ బాబు, జయసింహ మహార తదితరులు
బ్యానర్: శ్రీ స్కందాగ్రజ పతాకం
కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత: శివ నాగేశ్వరావు వీరేళ్ళ
కో డైరెక్టర్: సవరం శివరాం కుమార్
కెమెరామెన్: రమణ
మ్యూజిక్, రీ-రికార్డింగ్: యం.యల్.రాజ
పీఆర్వో: మధు వీఆర్
ఎడిటింగ్, డబ్బింగ్, డి ఏ : చింటూ గ్యాంగ్ స్టూడియో గుంటూరు

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X