Don't Miss!
- Sports
INDvsAUS : భారత్‌తో టెస్టు సిరీస్ ముందు.. బెంగళూరులో ఆస్ట్రేలియా జట్టు ప్రాక్టీస్ సెషన్స్
- News
హైదరాబాద్‌లో మరో దిగ్గజ సంస్థ గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్: 1800 మందికి ఉపాధి
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
జ్వాలా గుత్తాతో అర్ధరాత్రి హీరో హల్చల్.. బర్త్ డే పార్టీలో ఫుల్ ఎంజాయ్
బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా జ్వాలా గుత్తా అందరికీ సుపరిచితమే. సినిమాల్లోనూ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చి ఆహా అనిపించింది. హీరో నితిన్, జ్వాలా గుత్తా ఇద్దరూ మంచి స్నేహితులన్న సంగతి తెలిసిందే. అందుకే గుండెజారి గల్లంతయ్యిందే అనే చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ చేసి అందర్నీ ఆశ్చర్య పరిచింది. స్పోర్ట్స్‌లో సాధించిన విజయాలు ఆమెను ఎంతగా పాపులర్ చేశాయో.. ఆమె చేసే వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా అంతే వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఆమె తమిళ హీరో విష్ణు విశాల్‌తో ప్రేమలో ఉంది.

అలా వేర్వేరు..
జ్వాల గతంలో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కొద్దికాలానికి పరిమితం అయింది. ఇటు హీరో విష్ణు విశాల్ కు కూడా రజనీ అనే అమ్మాయితో వివాహం జరిగింది. కానీ వీళ్లు కూడా విడిపోయారట. అలా వేర్వేరు అయి.. ఇలా వీరిద్దరూ ఒక్కటయ్యారు.

అలాంటి ప్రేమ..
వీరిద్దరూ డేటింగ్‌కే పరిమితం అవుతారా.. లేక పెళ్లి చేసుకుని ఓ ఇంటివారవుతారా అని ఎన్నో కామెంట్స్ వినిపించాయి. వీటిపై జ్వాల స్పందిస్తూ.. తమకు ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదని.. అయితే ప్రేమ విషయంలో మాత్రం మేము చాల క్లారిటీగా ఉన్నామని, తమది గౌరవంతో కూడుకున్న ప్రేమ అని చెప్పుకొచ్చిందంటా.

తాజాగా ప్రియుడి కోసం..
తాజాగా ప్రియుడి కోసం జ్వాలా గుత్తా పెద్ద సాహసమే చేసింది. కరోనా ఇంతలా విజృంభిస్తున్నా.. ప్రియుడి చెంతకు చేరింది. అర్దరాత్రి బర్త్ డే సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.
Recommended Video

బర్త్ డే సర్ ప్రైజ్..
ఈ మేరకు విష్ణు విశాల్ ఆనందంలో తేలిపోతోన్నట్టు కనిపిస్తోంది. నా బర్త్ డే సర్ ప్రైజ్ అంటూ జ్వాలా గుత్తా తెచ్చిన కేక్‌ను కట్ చేస్తున్నాడు. ఇక వీరిద్దరూ అన్యోన్యంగా ఉన్న ఫోటోలు కూడా తెగ వైరల్ అవుతున్నాయి. రాత్రంతా బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. అంతా బాగుంది కానీ ఇక పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.