For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక మగధీరుడు.. బాహుబలి.. ఒక బాషా.. జాక్‌పాట్‌తో అదరగొట్టిన జ్యోతిక

|

విలక్షణ తారలు జ్యోతిక, రేవతి కలిసి నటించగా, 2డీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జాక్‌పాట్. ఈ చిత్రాన్ని స్టార్ హీరో సూర్య నిర్మాతగా మారి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉండటమే కాకుండా జ్యోతిక, రేవతి హంగామా విశేషంగా ఆకట్టుకొనేలా ఉంది.

ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక బాషా అంటూ చెప్పిన పంచ్ డైలాగ్స్ అదరగొట్టాయి. మీరు ఈ జన్మలో కూడా దాదా కాదు అంటూ చెప్పిన డైలాగ్స్ కామెడీ రుచిని చూపించాయి. పలు రకాల వేషాల్లో జ్యోతిక, రేవతి నటన, యాక్షన్, ఫైట్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ కథలో సామాజిక సందేశం కూడా ఉన్నట్టు కనిపిస్తున్నది. సరైన తీరులో ఉంటే లేని వారు అంటూ ఉండరు అనే సామాజిక కోణాన్ని చూపించారు. జ్యోతిక, రేవతి కాంబినేషన్‌లో సీన్లు అద్భుతంగా ఉన్నాయి.

Jyotika and Revathis Jockpot trailer trending

జాక్ పాట్ చిత్రంలో జ్యోతిక‌తో పాటు సీనియ‌ర్ న‌టి రేవ‌తి కూడా ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. ఈ సినిమా ఆగ‌స్ట్ 2న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌లకు ముస్తాబైంది. హీరో సూర్య త‌న స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై నిర్మించారు. త‌మిళ ట్రైల‌ర్ ఆల్ రెడీ విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకోగా.. తెలుగు ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఇంకా ఈ చిత్రంలో ఆనంద్‌ రాజ్‌, రాజేంద్ర‌, మ‌న్సూర్ అలీఖాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

English summary
Jyotika and Revathi's official Telugu Trailer of #Jackpot directed by Kalyaan and produced by 2D Entertainment!. Hero Suriya is the producer. This movie trailer getting good response.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more