Don't Miss!
- News ఉరేయాలన్న బొత్స తండ్రి సమానుడా ? వైఎస్ నూ వదల్లేదుగా- జగన్ కు షర్మిల కౌంటర్..!
- Sports ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను- కమిన్స్ Video
- Travel ఐఆర్సిటీసి వారి హైదరాబాద్ టు అహ్మదాబాద్ 8 రోజుల ట్రైన్ టూర్ ప్యాకేజీ...
- Finance Gold Bonds: గోల్డ్ బాండ్స్ ప్రీమెచూర్ ధర ప్రకటించిన ఆర్బీఐ.. పూర్తి వివరాలివే..
- Automobiles సేఫ్టీలో మహీంద్రా బొలెరో నియోకు కేవలం 1-స్టార్ రేటింగ్.. దీనిపై కంపెనీ ఏమందంటే??
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
- Lifestyle వేసవిలో కడుపులో చల్లగా ఉంచే కీరకాయ పెరుగుపచ్చడి-అన్నం, రోటీ లేదా చపాతీ దేనికైనా...
ఒక మగధీరుడు.. బాహుబలి.. ఒక బాషా.. జాక్పాట్తో అదరగొట్టిన జ్యోతిక
విలక్షణ తారలు జ్యోతిక, రేవతి కలిసి నటించగా, 2డీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కల్యాణ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం జాక్‌పాట్. ఈ చిత్రాన్ని స్టార్ హీరో సూర్య నిర్మాతగా మారి తెరకెక్కించారు. ఈ చిత్రానికి సంగీతం విశాల్ చంద్రశేఖర్ అందించారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా ఉండటమే కాకుండా జ్యోతిక, రేవతి హంగామా విశేషంగా ఆకట్టుకొనేలా ఉంది.
ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక బాషా అంటూ చెప్పిన పంచ్ డైలాగ్స్ అదరగొట్టాయి. మీరు ఈ జన్మలో కూడా దాదా కాదు అంటూ చెప్పిన డైలాగ్స్ కామెడీ రుచిని చూపించాయి. పలు రకాల వేషాల్లో జ్యోతిక, రేవతి నటన, యాక్షన్, ఫైట్లు ఆకట్టుకొనేలా ఉన్నాయి. ఈ కథలో సామాజిక సందేశం కూడా ఉన్నట్టు కనిపిస్తున్నది. సరైన తీరులో ఉంటే లేని వారు అంటూ ఉండరు అనే సామాజిక కోణాన్ని చూపించారు. జ్యోతిక, రేవతి కాంబినేషన్లో సీన్లు అద్భుతంగా ఉన్నాయి.
జాక్ పాట్ చిత్రంలో జ్యోతికతో పాటు సీనియర్ నటి రేవతి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఆగస్ట్ 2న తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు ముస్తాబైంది. హీరో సూర్య తన స్వంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. తమిళ ట్రైలర్ ఆల్ రెడీ విడుదలై మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకోగా.. తెలుగు ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ చిత్రంలో ఆనంద్ రాజ్, రాజేంద్ర, మన్సూర్ అలీఖాన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.