K Bhagyaraj Net Worth: స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా తెరపై మ్యాజిక్.. కే భాగ్యరాజ్ ఆస్తులు ఎన్ని కోట్లంటే?

కోలీవుడ్ దర్శక దిగ్గజం కే భాగ్యరాజ్ హఠాన్మరణం చెందారు. జూన్ 27న చెన్నైలోని తన నివాసంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపు 5 దశాబ్థాలుగా భాగ్యరాజ్ తన సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన మరణంతో తమిళ చిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయ్యింది. భాగ్యరాజ్ గురువు, లెజెండరీ దర్శకుడు భారతీరాజా కొద్దిరోజుల క్రితం మరణించగా.. ఇప్పుడు శిష్యుడు కూడా కన్నుమూయడంతో కోలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనవుతోంది. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో భాగ్యరాజ్ ఎంత సంపాదించారు? ఆయన ఆస్తులు విలువ ఎంత? అనేది పరిశీలిస్తే...

కుటుంబ కథలతో బ్లాక్‌బస్టర్స్
భారతీరాజ్, జీ రామకృష్ణన్ వద్ద సహాయ దర్శకుడిగా సినీ ప్రస్థానం ప్రారంభించిన ఆయన వారి వద్ద దర్శకత్వ శాఖలో మెళకువలు నేర్చుకున్నారు. ప్రధానంగా స్క్రీన్ ప్లేపై భాగ్యరాజ్‌కున్న పట్టు సామాన్యమైనది కాదు. గురువు భారతీరాజా పల్లెటూరి వాతావరణంలో సహజమైన కథలు, రా అండ్ రియలస్టిక్ పాత్రలతో వెండితెరపై ప్రయోగాలు చేసి ట్రెండ్ సెట్టర్‌గా నిలవగా.. భాగ్యరాజ్ దీనికి విరుద్దమైన బాటను ఎంచుకున్నారు. మరీ ముఖ్యంగా మధ్య తరగతి జీవితాలు, ఉమ్మడి కుటుంబాలు, భార్యాభర్తల అనుబంధం వంటి అంశాలతో ఎక్కువగా సినిమాలు తీశారు.

K Bhagyaraj Net Worth Here is the wealth of veteran tamil filmmaker

స్క్రీన్ ప్లే మాంత్రికుడు
అంతేకాదు.. భాగ్యరాజ్ సినిమాలలో విలన్లు ఉండరు. కేవలం పాత్రల మధ్య వచ్చే సంఘటనలు, అపార్ధాలు, అనుమానాలు, కష్టాలనే విలన్లుగా చూపించి సక్సెస్ కొట్టారు. ఊహించని మలుపులు, వ్యంగ్యంతో కూడిన డైలాగులు అన్ని వర్గాలను ఆకట్టుకున్నాయి. అందుకే ఆయనను సినీ క్రిటిక్స్.. స్క్రీన్ ప్లే మాంత్రికుడిగా అభివర్ణిస్తుంటాయి. స్క్రీన్ ప్లే విషయంలో ఆయనకు ఇండస్ట్రీలో ఎంతోమంది ఏకలవ్య శిష్యులు ఉన్నారు.

వన్ మ్యాన్ ఇండస్ట్రీ
హాస్యానికి పెద్ద పీట వేసినా తను చెప్పదలచుకున్న పాయింట్ మిస్ అవ్వకుండా స్క్రీన్ ప్లేను నడిపించడంలో ఆయన దిట్ట. అందుకే భాగ్యరాజ్ సినిమాలు ఘన విజయాలు సాధించాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఆయన చిత్రాలు రీమేక్‌ అయి వసూళ్ల వర్షం కురిపించేవి. కొన్ని సినిమాలకే ఆయన కథ, స్క్రీన్ ప్లేను అందించేవారు. దర్శకుడిగానే కాకుండా దర్శకుడిగానే కాకుండా కథా, స్క్రీన్ ప్లే, మాటలు, నటన, సంగీతం, గానం ఇలా అన్ని రకాల బాధ్యతలను తానే నిర్వర్తిస్తూ వన్ మ్యాన్ ఇండస్ట్రీ అని అభిమానులు, సినీ ప్రముఖుల చేత ప్రశంసలు దక్కించుకున్నారు భాగ్యరాజ్.

భాగ్యరాజ్ ఆస్తులు ఎంతంటే?
50 ఏళ్ల కెరీర్‌లో 75 సినిమాలలో నటించి, 25 సినిమాలలో నటించారు భాగ్యరాజ్. నటుడిగానూ ఆయన తన మార్క్ చూపించారు. కామెడీ, టైమింగ్‌తో ప్రేక్షకులను నవ్వించిన భాగ్యరాజ్.. ఎమోషనల్ సీన్స్‌లో ఏడిపించారు కూడా. ఈ వయసులోనూ ఎంతో ఉత్సాహంగా ఉంటూ అందరినీ నవ్విస్తూ ఉండే భాగ్యరాజ్ మరణం చిత్ర పరిశ్రమను విషాదంలో నెట్టింది. తమిళ సినీరంగంతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఆయన మృతిపట్ల సంతాపం తెలియజేస్తోంది.

ఇదిలాఉండగా.. 50 ఏళ్లుగా సినీరంగంలో తనదైన ముద్ర వేసిన భాగ్యరాజ్ ఎంత సంపాదించారంటూ నెటిజన్లు ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్న వివరాలను బట్టి చూస్తే.. చెన్నై నుంగంబాక్కంలో ఉన్న 10 కోట్ల రూపాయల విలువైన నివాసంతో పాటు 50 లక్షల రూపాయల విలువైన కారు ఆయనకు ఉన్నట్లుగా సమాచారం. సినీ నిర్మాణం, నటుడిగా వచ్చే పారితోషికం ఆయనకు ఆదాయ మార్గాలుగా తెలుస్తోంది. మొత్తంగా కే భాగ్యరాజ్ ఆస్తుల విలువ 50 నుంచి 70 కోట్ల రూపాయల రేంజ్‌లో ఉంటుందని కోలీవుడ్ టాక్. తన సినిమాలతో నవ్వించడంతో పాటు వారిని ఆలోచింపజేయగల అరుదైన దర్శకుల్లో ఒకరిగా నిలిచిన కే భాగ్యరాజ్‌ను సినీ పరిశ్రమ, ప్రేక్షకులు ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X