‘హనుమాన్’పై అంచనాలు పెంచిన నిర్మాత: ఆ హాలీవుడ్ చిత్రాలతో పోలుస్తూ కామెంట్
విలక్షణ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ.. దర్శకుడిగా ఎంతో మంచి పేరును సంపాదించుకున్నాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇప్పటికే 'అ!', 'కల్కి', 'జాంబీ రెడ్డి' వంటి విభిన్న తరహా ప్రయోగాత్మక చిత్రాలు చేసిన అతడు.. ప్రస్తుతం తేజ సజ్జా హీరోగా 'హనుమాన్' అనే సినిమాను చేస్తున్నాడు. రియల్ సూపర్ హీరోగా పేరున్న హనుమంతుడి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఇప్పటికే దీని నుంచి విడుదలైన మోషన్ పోస్టర్.. ఈ చిత్రంపై అంచనాలను పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ప్రొడ్యూసర్ చేసిన కామెంట్స్ వాటిని రెట్టింపు చేసేస్తున్నాయి.
'హనుమాన్' సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థపై కే నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈరోజు ఆయన పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని ఓ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా 'హనుమాన్' మూవీ గురించి కీలక విషయాలను వెల్లడించారు. 'హనుమాన్ మూవీ ఎంతో బాగా వస్తుంది. ప్రశాంత్ వర్మ దీన్ని అనుకున్న దానికంటే మంచి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా హాలీవుడ్ మూవీస్ 'స్పైడర్‌మ్యాన్', 'బ్యాట్‌మ్యాన్' రేంజ్‌లో ఉంటుంది. విజువల్ వండర్‌గా ఉంటూనే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా దీన్ని రూపొందిస్తున్నాం. అందరూ దీన్ని తప్పకుండా ఎంజాయ్ చేస్తారు' అని వెల్లడించారాయన.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'హనుమాన్' సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అనుగుణంగానే దీన్ని హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో తెరకెక్కిస్తున్నారు. గతంలో తేజ సజ్జా - ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో 'జాంబీ రెడ్డి' మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో నటించే మిగిలిన నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక, ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేయాలని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











