For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  K.Raghavendra rao: 100 సినిమాల దర్శకేంద్రుడు మొదటిసారిగా యాక్టింగ్.. ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టేసాడు

  |

  ఒకప్పుడు దర్శకులు కెమెరా ముందుకు రావడానికి అస్సలు ఇష్టపడే వారు కాదు. అగ్ర నటుల నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ వరకు అందరికి నటించి చూపే దర్శకులు యాక్టర్ అయితే చూడాలని చాలామంది అనుకుంటారు. ఇక దర్శకులు యాక్టర్స్ అయిన సందర్బాలు చాలానే ఉన్నాయి. అయితే అందులో కొంతమంది మాత్రమే క్లిక్కయ్యారు. ఇక కె.రాఘవేంద్రరావు రావు కూడా మొదటిసారి మేకప్ వేసుకొని నటుడిగా మారడం హాట్ టాపిక్ గా మారింది.

  అలా చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా

  అలా చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా

  ఎంతోమంది అగ్ర నటీనటులను తెరపై సరికొత్తగా నటింప జేసిన కె.రాఘవేంద్రరావు వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి వారిని మంచి నటులుగా ఇండస్ట్రీకి పరిచయం చేయించారు. హీరోయిన్స్ ను అందంగా ప్రజెంట్ చేయడంలో ఆయన తరువాతే ఎవరైనా. శ్రీదేవి నుంచి తాప్సి వరకు అందరూ ఇండస్ట్రీలో బ్యూటీఫుల్ హీరోయిన్స్ గా క్రేజ్ అందుకునేలా చేశారు.

  వంద సినిమాలకు పైగా..

  వంద సినిమాలకు పైగా..

  వందకు పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన అతికొద్ది మంది దర్శకుల్లో కె.రాఘవేంద్రరావు రావు ఒకరు. ఫ్యామిలీ, యాక్షన్, అడ్వెంచర్, డేవోషనల్.. ఇలా అన్ని రకాల జానర్స్ ను టచ్ చేశారు. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నర్, కృష్ణ వంటి అగ్ర నటులను వెండితెరపై తనదైన శైలిలో చూపించి ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నారు. అంతే కాకుండా వారి తరువాత తరం వారిని కూడా ఇండస్ట్రీలో మంచి నటులుగా పరిచయం చేయించారు.

  నటుడిగా మొదటిసారి

  నటుడిగా మొదటిసారి

  ఇక ఇన్నేళ్ల సుదీర్ఘ ప్రయాణం తరువాత కె.రాఘవేంద్రరావు నటనలోకి అడుగు పెడుతుండడం విశేషం. సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకైన రోషన్ హీరోగా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే. కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో పెళ్లి సందD అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఆయన ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.

  త్వరలోనే రిలీజ్

  త్వరలోనే రిలీజ్

  రోషన్ గతంలోనే నిర్మల కాన్వెంట్ అనే ఒక సినిమా చేశాడు. కానీ ఆ సినిమా అంతగా క్లిక్కవ్వలేదు. ఇక ఇప్పుడు రీ లాంచ్ అవుతూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాడు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రొనంకి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను త్వరలోనే రిలీజ్ చేయనున్నారు.

  న్యూ లుక్ రిలీజ్

  ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలా నటించింది. ఇక విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ డోస్ పెంచారు. ఇక కె.రాఘవేంద్రరావు చేస్తున్న పాత్రకు సంబంధించిన ఒక లుక్ కూడా విడుదల చేశారు. అందులో ఆయన చాలా కొత్తగా కనిపిస్తున్నారు. చూస్తుంటే నటుడిగా మరికొన్ని సినిమాలు కూడా చేయవచ్చని అనిపిస్తోంది.

  అప్పట్లోనే బిగ్గెస్ట్ హిట్

  అప్పట్లోనే బిగ్గెస్ట్ హిట్

  శ్రీకాంత్ తో 20ఏళ్ళ క్రితం రాఘవేంద్రరావు డైరెక్ట్ చేసిన పెళ్లి సందడి ఏ తరహాలో హిట్టయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అప్పట్లోనే ఆ సినిమా దాదాపు 10కోట్ల వరకు లాభాలను అందించింది. ఇక ఇప్పుడు రాబోయే పెళ్లి సందD ఎ రేంజ్ లో స్సక్సెస్ అవుతుందో చూడాలి.

  Anand Devarakonda Exclusive Interview | Middle Class Melodies Not Similar To Pelli Choopulu
  మరోసారి పర్ఫెక్ట్ గా

  మరోసారి పర్ఫెక్ట్ గా

  ఇటీవల సినిమా నిర్మాతలు ఓటీటీ ఆఫర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వచ్చింది. కానీ ఇంకా విషయంలో అయితే చిత్ర యూనిట్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక కీరవాణి మ్యూజిక్ సినిమాకు ఎంతగానో బజ్ క్రియేట్ చేసింది. కె.రాఘవేంద్రరావు మ్యాజిక్ మరోసారి పర్ఫెక్ట్ గా సెట్టయ్యింది. ఇక అదే తరహాలో శ్రీకాంత్ కొడుకు కూడా నేటితరం పెళ్లి సందDతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి ఆ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

  English summary
  After directing over 100 films, k Ragavendra rao garu is debuting as an actor with PelliSandaD. Here's the first look…
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X