ముద్దులు లేకుండా సినిమానా? సుమ ముందే చిలిపిగా రాఘవేంద్రరావు కామెంట్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్ బ్యానర్లపై దర్శకుడు రవికాంత్ పేరేపు డైరెక్షన్‌లో యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుమారుడు రోషన్ కనకాల నటించిన చిత్రం బబుల్ గమ్. హర్షా చెముబు, కిరణ్ మచ, హర్షవర్ధన్, మానస చౌదరీ నటించారు. ఈ సినిమాకు శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా, సురేష్ రగుతు సినిమాటోగ్రఫి బాధ్యతలను నిర్వహించారు. ఈ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ డిసెంబర్ 15వ తేదీన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్ర రావు చేతుల మీదుగా జరిగింది. అనంతరం రాఘవేంద్రరావు మాట్లాడుతూ..

బబుల్ గమ్ సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్. ఈ వేదికపై విశేషం ఏమిటంటే.. RRR అంటేనే ఆ సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది. కానీ ఈ వేదికపై రవికాంత్, రోషన్, రాఘవేంద్రరావు, రానా, రావిపూడి అనిల్, రాజీవ్ ఉన్నారు. సుమ ఏం చేసినా దాని వెనుక మాస్టర్ ప్లాన్ ఉంటుంది. ఆమె మా సెట్లోనే పెళ్లి చేసుకొన్నది. రోషన్‌కు జన్మనిచ్చింది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఈ రోజుల్లో ముద్దుల్లేకుండా సినిమాలు ఆడవు అని అన్నారు. ఇంకా ఆయన ఏం మాట్లాడారంటే..


Click it and Unblock the Notifications











