twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కీరవాణి గర్వించదగ్గ క్షణాలు.. మత్తు వదలరాపై దర్శకేంద్రుడి ప్రశంసలు

    |

    కథను నమ్ముకుని చిత్రాలను తీస్తే.. ప్రేక్షకులు ఆదరిస్తారమని మరోసారి నిరూపించింది మత్తువదలరా. కమర్షియల్ అంశాలేమీ లేకపోయినప్పటికీ ఈ చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రతీ సీన్ ఉత్కంఠగా సాగుతూ ఆద్యంతం నవ్వులు పంచేలా నడించిన కథనం అందర్నీ కట్టిపడేసింది. కీరవాణి తనయులైన శ్రీ సింహీ హీరోగా, కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో వారి కుటుంబంలో అనందం రెట్టింపైనట్టు కనిపిస్తోంది.

    కొత్త దర్శకుడి ప్రయోగం..

    కొత్త దర్శకుడి ప్రయోగం..

    రితేష్ రానా రాసుకున్న కథ, తెరకెక్కించిన విదానానికి అందరూ మంత్ర ముగ్దులవుతున్నారు. ఈ చిత్రానికి పాటలు, కమర్షియల్ అంశాలు అవసరం లేదనిపించిందని, అందుకే కేవలం కథపైనే ఫోకస్ పెట్టామని దర్శకుడు చెప్పుకొచ్చాడు. తనకు చిరంజీవి అంటే ఇష్టమని, అందుకే ఆయన పాటలుండేలా కథనాన్ని రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ మెచ్చుకుంటున్నారని అన్నాడు.

    కొనియాడిన రాజమౌళి..

    కొనియాడిన రాజమౌళి..

    ఈ చిత్రాన్ని చూసిన రాజమౌళి.. తన ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ‘మా అబ్బాయిల గురించి మేము చెబితే బాగుండదు.. మీరే చిత్రాన్ని చూసి అభిప్రాయాన్ని చెప్పండి.. ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠభరితంగా రితేష్ రానా తెరకెక్కించాడని, అందర్నీ మెప్పిస్తుంద'ని చెప్పుకొచ్చాడు.

     దర్శకేంద్రుడి ప్రశంసలు..

    దర్శకేంద్రుడి ప్రశంసలు..

    తాజాగా రాఘవేంద్రరావు సైతం సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘మత్తు వదలరా.. ఇది ఒక ట్రెండీ ఫిల్మ్‌. సింహా నటన ఆకట్టుకునేలా ఉంది. అలాగే కాలభైరవ అందించిన నేపథ్య సంగీతం చాలా అద్భుతంగా ఉంది. దర్శకత్వంలో రితేశ్‌ రానా మంచి ప్రతిభను కనబరిచాడు. తల్లిదండ్రులుగా కీరవాణి, వల్లిగారికి ఇది ఒక గర్వించదగ్గ క్షణం. చిత్రబృందానికి కంగ్రాట్స్‌. భవిష్యత్తు ప్రాజెక్ట్‌లకు గుడ్‌ లక్‌' అని ట్వీట్ చేశాడు.

    సోషల్ మీడియాలో కామెంట్లు..

    సోషల్ మీడియాలో కామెంట్లు..

    ఈ ఏడాదికి మంచి ముగింపు, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ లాంటి గ్రిప్పింగ్ సినిమా రాగా.. ముగింపులో మత్తవదలరా వంటి అద్భుతమైన సినిమా వచ్చిందని కామెంట్లు చేస్తున్నారు. సినిమా చూసిన ప్రతీ ప్రేక్షకుడు సత్య కామెడీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ట్విస్ట్‌ల గురించి ప్రత్యేకంగా ట్వీట్లు చేస్తున్నారు.

    English summary
    K Raghavendra Rao Praised Mathu Vadalara Movie. MathuVadalara is a very trendy film. simhakoduri acting was impressive & great BGM from kaalabhairava . Director RiteshRana , an excellent job. Surely a moment of pride for parents Keeravaani garu & Valli garu!Congrats to the entire team & good luck on future projects!
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X