For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఏ పని లేకుండా రాజమౌళి 'బలాదూర్'గా తిరిగేవాడు.. మొదటిసారి జక్కన్న గుట్టు విప్పిన విజయేంద్రప్రసాద్

  |

  టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని అమాంతంగా పెంచేసిన దర్శకుల్లో SS. రాజమౌళి మొదటి స్థానంలో ఉంటాడని చెప్పవచ్చు. ఎలాంటి సినిమా చేసినా కూడా ప్రతిసారి అభిమానుల అంచనాలను ఈజీగా అందుకుంటూ వస్తున్నాడు. పాన్ ఇండియా అనే పదానికి అసలు అర్దాన్ని చెప్పిన రాజమౌళి ఒకప్పుడు బలాదూర్ గా ఏ పని పాట లేకుండా తిరిగేవాడు అంటే ఎవరైనా నమ్మగలరా?.. ఆ విషయాన్ని ఇటీవల స్వయంగా ఆయన తండ్రి ప్రముఖ రైటర్ కె.విజయేంద్రప్రసాద్ ఓపెన్ గా చెప్పేశారు.

   రాజమౌళి పడే తాపత్రయం అంతా ఇంతా కాదు

  రాజమౌళి పడే తాపత్రయం అంతా ఇంతా కాదు

  దర్శకధీరుడిగా తనకంటూ ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న రాజమౌళి కెరీర్ అంత ఈజీగా ఏమి సాగలేదు. ఏ చెట్టుకు అంతే గాలి అన్నట్లు ప్రతి మనిషిలో ఏదో ఒక కష్టం ఉంటుంది. ఒక సినిమా కోసం రాజమౌళి పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. ఆయన జీవితంలో ఇప్పుడు ఎన్నో ఆనందమైన క్షణాలు విజయాలు ఉండవచ్చు. కానీ ఒకప్పుడు చాలా కష్టాలను దాటుకుంటూ వచ్చారు.

   ఫైనాన్షియల్ గా ఇబ్బందులు

  ఫైనాన్షియల్ గా ఇబ్బందులు

  రాజమౌళి ఫ్యామిలీ మొదట్లో ఉన్నతమైన కుటుంబమే. ఎంతో ఉన్నతంగా బ్రతికిన వారు అనుకోకుండా ఒక సినిమాను నిర్మించి మధ్యలోనే అపెయ్యాల్సి వచ్చింది. ఆ తరువాత ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో సంగీత దర్శకుడు కీరవాణి ద్వారా కుటుంబం మొత్తం మళ్ళీ సేఫ్ జోన్ లోకి వచ్చేసింది.

  బలాదూర్ గా తిరిగేవాడట

  బలాదూర్ గా తిరిగేవాడట

  ఇక అసలు మ్యాటర్ లోకి వస్తే దర్శకుడు రాజమౌళి యుక్త వయసులో ఉండగా చాలా మంది అబ్బాయిలలానే ఏ పని లేకుండా బలాదూర్ గా తిరిగేవాడట. ఆ విషయాన్ని ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో రైటర్ కె.విజయేంద్రప్రసాద్ ఓపెన్ గా చెప్పేశారు.

  డిగ్రీ చేయించాలని అనుకుంటే..

  డిగ్రీ చేయించాలని అనుకుంటే..

  ఇంటర్మీడియెట్ అయిపోయిన తరువాతి డిగ్రీ చేయించాలని అనుకున్నారట. కానీ అప్పట్లో ఫైనాన్షియల్ గా ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో రాజమౌళిని గ్రాడ్యుయేషన్ లో చేర్పించలేదని విజయేంద్రప్రసాద్ అన్నారు. ఒకనొక సమయంలో బలాదూర్ గా తిరుగుతున్నప్పుడు పిలిచి డైరెక్ట్ గా ఆడిగేశానని చెప్పారు.

  డైరెక్టర్ అవ్వాలని అప్పుడే చెప్పాడట..

  డైరెక్టర్ అవ్వాలని అప్పుడే చెప్పాడట..

  అసలు నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అని ఓపెన్ గా అడగడంతో డైరెక్టర్ అవ్వాలని ఉందని చెప్పగానే మొదట ఏడిటింగ్ వర్క్ నేర్చుకొమ్మని కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర జాయిన్ చేశారట. అనంతరం కీరవాణి దగ్గర మ్యూజిక్ పై పట్టు సాధించి తన దగ్గర కూడా స్టోరీ రైటింగ్ గురించి కూడా నెర్చుకున్నట్లు విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.

  అలా మొదటి అవకాశం..

  అలా మొదటి అవకాశం..

  ఫైనల్ గా కె.రాఘవేంద్రరావు రాజమౌళి టాలెంట్ ను గుర్తించి మొదట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యాడ్స్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇప్పించారు. అనంతరం శాంతి నివాసం సీరియల్ ను డైరెక్ట్ చేసే ఛాన్స్ కూడా ఇప్పించినట్లు కె.విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు. నా కొడుకు నా కంటే గొప్పవాడు అయిన సంతోషం ఎల్లప్పుడూ ఉంటుందని, అయితే అతని స్థాయికి ఎప్పుడు ఏడుగుతాను అనే కోరిక కూడా తనలో ఉందని అన్నారు.

  English summary
  Movie fans across the country are eagerly awaiting for Tollywood’s Biggest Multistarrer Movie RRR. The dose of anticipation has skyrocketed as the mega Nandamuri descendants have united to share the screen like never before. Clarity was given on the original update of the movie. Junior NTR is going to give a powerful update on the occasion of his birthday.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X