twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    RRR ఫైట్ చూస్తే కన్నీళ్లు ఆగవు.. ఆ సీన్‌లో తారక్ ఏడిపించేశాడు: రైటర్ విజయేంద్రప్రసాద్

    |

    టాలీవుడ్ అభిమానులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు RRR కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా చేస్తుండడంతో అంచనాలు ఒక్కసారిగా అకాశాన్ని దాటేశాయి. ఇక సినిమాకు సంబంధించిన రూమర్స్ వైరల్ అవుతున్న సమయంలోనే సినిమా స్టోరీ రైటర్ KV విజయేంద్రప్రసాద్ కూడా సినిమా గురించి ఒక కీలకమైన విషయాన్ని చెప్పి మరింత హైప్ క్రియేట్ చేశారు.

    కాంట్రవర్సీకి తావివ్వకుండా..

    కాంట్రవర్సీకి తావివ్వకుండా..

    దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తుండగా, జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఆ సమర యోధులను ఎలా చూపిస్తారు అనేది అందరిలో ఎంతో ఆసక్తిని రేపుతోంది. వీలైనంత వరకు కాంట్రవర్సీకి తావివ్వకుండానే దర్శకుడు ఆ పాత్రలని డిజైన్ చేసుకున్నాడు.

    అభిమానులకు నచ్చే విదంగా

    అభిమానులకు నచ్చే విదంగా

    ఇక సినిమాలో ప్రతి సన్నివేశం కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందని ఇప్పటికే చాలా మంది టెక్నీషియన్స్ నటీనటులు వివరణ ఇచ్చారు. RRR కు వర్క్ చేయడం గర్వంగా ఉందని కూడా అన్నారు. చరణ్ - తారక్ అభిమానులకు నచ్చే విదంగానే సినిమా ఉంటుందని ఇద్దరి హీరోలను సమానంగా చూపించినట్లు చెబుతున్నారు.

    రామ్ చరణ్ - తారక్ యాక్షన్ సీన్స్

    రామ్ చరణ్ - తారక్ యాక్షన్ సీన్స్

    సినిమాలో నటించిన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గత ఇంటర్వ్యూలో జైలు సన్నివేశం గురించి వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే రామ్ చరణ్ పోలీస్ అధికారిగా కొమరం భీమ్ ను అరెస్ట్ చేయడానికి గ్రామానికి వెళ్లే సీన్ కూడా అద్భుతంగా ఉంటుందట. ఇద్దరు కలిసి చేసే వీరోచిత యాక్షన్ సన్నివేశాలకు గూస్ బంప్స్ రావడం కాయమని చెబుతున్నారు.

    RRRలో పుష్కలంగా..

    RRRలో పుష్కలంగా..

    ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోరీ రైటర్ KV విజయేంద్రప్రసాద్ కూడా మొదటిసారి సినిమా గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సినిమాలో ఎప్పుడైనా సరే ఎమోషన్ కరెక్ట్ గా పండితేనే బాగా వర్కౌట్ అవుతుందని ఆ అంశాలు RRRలో పుష్కలంగా ఉన్నాయని అన్నారు.

    కన్నీళ్లు తెప్పించే సీన్..

    కన్నీళ్లు తెప్పించే సీన్..

    జూనియర్ ఎన్టీఆర్ ఇంతవరకు కూడా ఎక్కువగా కరుణ, ఎమోషనల్ అయ్యే క్యారెక్టర్లలో ఎక్కువగా హైలెట్ అవ్వలేదు. కానీ ఈసారి మాత్రం తప్పకుండా ఆ విషయంలో సంతృప్తిని ఇవ్వగలడు. ముఖ్యంగా ఒక ఫైట్ సీన్ లో ఎమోషన్ ను పండించిన విధానం నాకు కన్నీళ్లు తెప్పించింది. ప్రేక్షకులకు కూడా అలాంటి అనుభూతి కలుగుతుంది.. అంటూ విజయేంద్రప్రసాద్ వివరణ ఇచ్చారు.

    English summary
    In a recent interview, story writer K. V. Vijayendra Prasad also tried to explain the film for the first time. He said that there are plenty of elements in RRR that would be a good workout if the emotion was always correct in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X