అడల్డ్ కంటెంట్‌తో కేఎస్ 100.. కానీ హద్దు మీరలేదు.. నిర్మాత
చంద్రశేఖరా మూవీస్ పతాకంపై కె. వెంకట్‌రామ్‌రెడ్డి నిర్మాతగా మోడలింగ్ స్టార్స్ సమీర్ ఖాన్, సునీతా పాండే, శైలజా తివారి, ఆశిరాయ్, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్ హీరోహీరోయిన్‌లుగా షేర్ (షాలిని ఫేమ్) దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ''కెఎస్100 ''.. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన రాగా ఇటీవల విడుదలైన ట్రైలర్,ఆడియో సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది. జూలై12న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కాబోతుంది.
ఈ సందర్భంగా నిర్మాత కె. వెంకట్‌రామ్‌రెడ్డి మాట్లాడుతూ.. సబ్జెక్టు పరంగా కొంత అడల్ట్ కంటెంట్ అయితే ఉంది కానీ.. కథ పరంగా వెళ్ళామే తప్ప మేము ఎక్కడా పరిధి దాటలేదు. అందుకనే సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. థియేటర్స్ నుండి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది.

మంచి కంటెంట్ ఉన్న స్టోరీ కాబట్టి అందరూ మోడల్స్ నే తీసుకోవడం జరిగింది. సమీర్ ఖాన్, సునీతా పాండే, శైలజ తివారి, ఆశిరాయ్, శ్రద్దా శర్మ, అక్షిత మాధవ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అలాగే ఇటీవల ఎన్నో సినిమాల్లో నటించి నేషనల్ చైల్డ్‌ఆర్టిస్ట్‌గా పేరు తెచ్చునకున పూర్వి అనే అమ్మాయి ఒక కీలక పాత్రలో నటించింది. ఆ క్యారెక్టర్ మనల్ని అందరినీ ఆలోచింపజేస్తుంది. అలాగే కల్పన, నందిని, సుమన్ ఇలా ప్రతి ఒక్కరు తమ పరిధి మేర బాగా నటించారు.
సినిమా జులై 12న విడుదలకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే అన్ని ఏరియాల్లో బిజినెస్ అయిపోయింది. నైజాం, సీడెడ్, బెంగుళూర్, నెల్లూరులో ఆల్రెడీ బిజినెస్ అయింది. త్వరలోనే కష్ణ, గుంటూరు కూడా అవుతుంది. ఇంకా హిందీ రైట్స్, డిజిటల్స్ రైట్స్ నా దగ్గరే ఉన్నాయి. అవి కాకుండానే మంచి బిజినెస్ జరిగి నేను సేఫ్‌లో ఉన్నాను. మా సినిమాను నిజాంలో 100 థియేటర్స్‌లో విడుదల చేస్తున్నాం. అలాగే ఓవర్‌సిస్‌లో కూడా మంచి బిజినెస్ జరిగింది.


Click it and Unblock the Notifications











