K.Viswanath: ఆ సినిమాకు చెప్పులు విడిచి థియేటర్ లో జనాలు.. డిజాస్టరన్న మూవీకి కాసుల వర్షం!

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న అతి కొద్ది మంది దర్శకులలో కే.విశ్వనాధ్ ఒకరు. ఆయన ఎలాంటి సినిమాలు తీసినా కూడా అందులో మనుషుల విలువలను మంచితనం యొక్క ప్రాధాన్యతను ఎక్కువగా చూపించేవారు.

ప్రతి సినిమాలో కూడా ఏదో ఒక మంచి సందేశం ఇచ్చేవారు. ఒకానొక సందర్భంలో ఆయన సినిమాలు చూడడానికి ప్రేక్షకులు చెప్పులు థియేటర్ బయట వదిలి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తరహాలో ఒక సినిమాకు అయితే మంచి గుర్తింపు లభించింది. డిజాస్టర్ అన్న సినిమాకు కూడా కాసుల వర్షం కురిపించింది.. ఆ వివరాల్లోకి వెళితే..

ఎన్నిసార్లు చూశావు అనే మాట..

ఎన్నిసార్లు చూశావు అనే మాట..

కె విశ్వనాథ్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకొని నేటి తరం దర్శకులకు నటులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారు. ఆయన నుంచి ఒక సినిమా వస్తుంది అంటే తప్పకుండా దాని గురించి మాట్లాడుకునే విధంగానే ఉంటుంది. అప్పట్లో శంకరాభరణం సినిమా కూడా ఎన్నిసార్లు చూశావు అనే మాట జనాల్లో బాగా పాపులర్ అయింది. అసలు చూడవద్దు అనుకున్న వాళ్లు కూడా ఆ సినిమాను చూసి వారి ఆలోచన విధానాన్ని కూడా మార్చుకున్నారు.

కె.విశ్వనాథ్ క్రేజ్

కె.విశ్వనాథ్ క్రేజ్

కె విశ్వనాథ్ అంటే తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక ప్రత్యేకమైన గౌరవ రూపం తీసుకువచ్చారు అని చెప్పవచ్చు. సినిమా దర్శకులకు కూడా అంతగా గౌరవం ఇస్తారా అని వారిని చూసిన తర్వాతనే చాలామందికి అర్థమయింది. కే విశ్వనాధ్ అనుకొని కొంతమంది బాపు గారి దగ్గర పెన్సిల్ తో ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన కాదని తెలిపాక అది అవసరం లేదు తుడిచేసిన అనుభవం ఎదురయ్యిందట. ఆ విషయాన్ని స్వయంగా బాపుగారు ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు.

 శంకరాభరణం సినిమా డిజాస్టర్..

శంకరాభరణం సినిమా డిజాస్టర్..

కె విశ్వనాథ్ సినిమా కెరీర్ లో ఎవరు మర్చిపోలేని సినిమాలలో శంకరాభరణం ఒకటి. ఆ సినిమా అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. మొదట సినిమా బాగా వచ్చింది అని అందరూ కూడా కొనియాడారు. కానీ సినిమాలో స్టార్ క్యాస్ట్ లేదని ఈ సంగీతం బ్యాక్ గ్రౌండ్ లో వచ్చిన సినిమాను ఎవరు చూడరు అని కామెంట్ చేసి బయ్యర్లు ఆ సినిమాను కొనుగోలు చేయలేదు. దీంతో సినిమా విడుదల కాకముందే డిజాస్టర్ అవుతుందేమో అని నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మొదట కొంత అప్సెట్ అయ్యారు.

మొదట థియేటర్స్ ఖాళీగా..

మొదట థియేటర్స్ ఖాళీగా..

సినిమాను విడుదల చేయడానికి చాలా కష్టపడుతున్న తరుణంలో ఎలాగోలా విడుదల చేశారు. కానీ మొదటి నాలుగు రోజులు కూడా ఎవరు కూడా సినిమాను పట్టించుకోలేదు. నాలుగవ రోజు కూడా సినిమా ధియేటర్లు అన్నీ ఖాళీగా కనిపించాయి. దీంతో సినిమా డిజాస్టర్ అవుతుందేమో అని అందరు అనుకున్నారు కానీ కె విశ్వనాథ్ మాత్రం తప్పకుండా సినిమా విలువ తెలుస్తుంది అని ధైర్యంతో ఉన్నారు.

 కాసుల వర్షం

కాసుల వర్షం

సినిమాలో ఒక నిజాయితీ నిజమైన అంశం ఉంటే తప్పకుండా అది జనాలకు ఎక్కుతుంది అని శంకరాభరణం సినిమా నిరూపించింది. నాలుగవ రోజు తర్వాత జనాల మౌత్ టాక్ ద్వారానే సినిమా ఒక్కసారిగా కలెక్షన్స్ పెంచుకుంది. ఆ సినిమా మరుసటి వారమే జిల్లాల వారీగా మళ్లీ భారీ స్థాయిలో విడుదలయ్యింది. నిర్మాతకు గ్యాప్ లేకుండా ఏడాది వరకు కాసుల వర్షం కురిపించింది. కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ అందుకుంది.

చెప్పులు థియేటర్ బయట వదిలి..

చెప్పులు థియేటర్ బయట వదిలి..

కొన్ని సందర్భాల్లో అయితే చాలా చోట్ల శంకరాభరణం సినిమాను చూసేందుకు జనాలు చెప్పులను థియేటర్ బయట వదిలేసి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతలా ఆ సినిమాను వారు ఆరాధించారు. ఇక కె విశ్వనాథ్ బయట ఎక్కడైనా కనిపిస్తే జనాలు ఒక్కసారిగా ఆయన కాళ్ళ మీద పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విదంగా ఆయన దర్శకుడిగా ఒక మంచి గుర్తింపు అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X