సూపర్ స్టార్ కృష్ణ ట్రాన్స్ ఫర్ అయ్యారు.. ఆయన కోరిక ఒక్కటే, కేఏ పాల్ వ్యాఖ్యలు

సూపర్ స్టార్. నట శేఖర్ కృష్ణ ఇకలేరు. సినిమా రంగానికి ఒక శకం ముగిసింది. మంగళవారం ఉదయం నాలుగు గంటలకు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్ లో సూపర్ స్టార్ కృష్ణ మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణంతో తెలుగు సినీ లోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. తండ్రి మరణం మహేశ్ బాబును కలచివేసింది. మహేశ్ బాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు దుఃఖ సంద్రంలో మునిగిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల సినీ ప్రముఖులు, పొలిటికల్ లీడర్స్ సంతాపం తెలియజేస్తున్నారు. ప్రముఖుల సందర్శనార్థం నానక్ రామ్ గూడలో ఆయన నివాసం వద్ద కృష్ణ పార్థివదేహాన్ని ఉంచారు. ఈ క్రమంలో ప్రజా శాంతి పార్టి అధ్యక్షుడు కేఏ పాల్ కృష్ణ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అలాగే కృష్ణ గొప్పదనం గురించి కొనియాడారు.

సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం..

సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం..

తెలుగు సినిమా నటశేఖరుడు సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం యావత్ సినీ లోకాన్ని విషాదంలోకి నెట్టింది. సూపర్ స్టార్ కృష్ణ మరణాన్ని జీర్ణించుకోలేక అభిమానులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. నానక్ రామ్ గూడలోని ఆయన నివాసంలో ఉన్న ఆయన పార్థీవ దేహానికి సినీ లోకమంతా తరలివచ్చింది. అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, చంద్రబాబు నాయుడు, కేటీఆర్ తో పాటు రాజకీయాల్లో కీలక నేతలు సైతం కృష్ణ పార్థీవ దేహానికి నివాళులు అర్పించారు. మహేశ్ బాబుకు ధైర్యం చెప్పారు.

శాంతి సభకు వచ్చారు..

శాంతి సభకు వచ్చారు..

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ కృష్ణ పార్థివదేహానికి ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ నివాళులు అర్పించారు. మహేశ్ బాబుని కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే ఆయనకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణతో ఆయనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. "కృష్ణగారికి, నాకు ఉన్న ఆత్మీయ పరిచయం చాలా గొప్పది. దాదాపు 26 సంవత్సరాల ముందు శాంతి సభకు ఆయన అటెండ్ అయ్యారు. ఆయన కోరిక ఒక్కటే.. సర్.. మీ శాంతి సందేశాలను ఒక సినిమాగా చేద్దామనుకుంటున్నా అని అన్నారు. ఆయన చెప్పినట్లుగానే శాంతి సందేశం లాంటి మంచి సినిమాను తీశారు.

ఆయన పిల్లలు ఛారిటీని నడపాలని..

ఆయన పిల్లలు ఛారిటీని నడపాలని..

నటులు ఎంతో మంది ఉంటారు. కానీ శాంతిన కోరే శాంతి దూత కృష్ణ గారు. లోపల ఆయన ఫిజికల్ గా చనిపోయినట్లు లేదు. ఈ లోకం నుంచి పరలోకానికి ట్రాన్స్ ఫర్ అయినట్లే. ఆయన ఛారిటీ వద్దకు వచ్చినప్పుడు చిన్నపిల్లలతో కలిసి ఆడుకునేవారు. శాంతికోసం ఎంతో శ్రమించారు. ఆయన పేరిట ఆయన పిల్లలు ఛారిటీని నడపాలని కోరుకుంటున్నారు. ఆయన ప్రశాంతమైన మరణాన్ని పొందారు" అని కేఏ పాల్ తెలిపారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలను నవంబర్ 16న నిర్వహించనున్నారు. అలాగే అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియో వద్ద ఉంచనున్నారు. అక్కడి నుంచి అంతిమయాత్ర నిర్వహించనున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X