RRR మూవీపై KA పాల్ రియాక్షన్.. టైమ్ వెస్ట్ అనడంతో.. 'నీ మొహం రా' అంటూ సీనియర్ డైరెక్టర్ కౌంటర్

గత వారం విడుదలైన RRR సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అద్భుతంగా నటించడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చాలా మంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులు కూడా ఈ సినిమా అద్భుతంగా ఉంది అని ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఈ క్రమంలో క్రైస్తవ మత ప్రచారకుడు, ప్రజాశాంతి అధ్యక్షుడు కెఏ పాల్ ఎవరు ఊహించని విధంగా RRR సినిమాపై కామెంట్ చేశాడు. ఇక ప్రముఖ దర్శకుడు ఆయన చేసిన కామెంట్స్ కు ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ హిట్ గా RRR

బాక్సాఫీస్ హిట్ గా RRR

ఇండియన్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన RRR సినిమా మొత్తానికి బాక్సాఫీస్ వద్ద 600 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకని పాజిటివ్ టాక్ తో ముందుకు సాగుతోంది. కేవలం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ లోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలో రెస్పాన్స్ అందుకుంది. హిందీ లోనే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోవడం విశేషం.

విదేశీయులు కూడా..

విదేశీయులు కూడా..

RRR సినిమా పై కేవలం ఇండియన్ సినీ లవర్స్ మాత్రమే కాకుండా విదేశీ సినీ ప్రేక్షకులు కూడా చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత సోషల్ మీడియాలో స్పందిస్తున్న విదేశీయులు మరొకసారి ఈ సినిమాను చూడాలని ఉందని కూడా స్పందిస్తూ ఉండడం విశేషం. ఇక దర్శకుడు రాజమౌళి భాషతో సంబంధం లేకుండా ఇతర దేశాల ప్రేక్షకులను కూడా ఆకర్షిస్తున్నట్లుగా తెలుస్తోంది.

లైవ్ లో కెఏ పాల్

లైవ్ లో కెఏ పాల్

అయితే క్రైస్తవ మత ప్రచారకుడు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ఇటీవల సోషల్ మీడియా లైవ్ లో సినిమా పేరు రాగానే ఎవరూ ఊహించని విధంగా రియాక్షన్ ఇచ్చాడు. సోషల్ మీడియా లైవ్ లో చాలా మంది ఫ్యాన్స్ RRR గురించి అడిగే ప్రయత్నం చేశారు. ప్రతి ప్రశ్నకు కూడా తనదైన శైలిలో సమాధానం ఇచ్చిన పాల్ సినిమా పేరు తీసుకురాగానే అసలు ఆ సినిమా విడుదలైన విషయం కూడా తెలియదు అన్నట్టుగా మాట్లాడడం విశేషం.

అదెక్కడ మూవీ అయ్యా బాబు?

అదెక్కడ మూవీ అయ్యా బాబు?

RRR సినిమా చూశారా అని ఓ అభిమాని ప్రశ్నించగా RRR సినిమా ఏంటి అసలు? అదెక్కడ మూవీ అయ్యా బాబు? రోజుకో మూవీ వస్తున్నట్లు ఉంది అని కామెంట్ చేశారు. అంతేకాకుండా సినిమాలు చూడడం టైం వేస్ట్ అని మార్పు కోసం ఆలోచించాలి అని కులాలు కుటుంబ రాజకీయాల తో సంబంధం లేకుండా రాజకీయాలు ఉండాలని ఆ మార్పు ప్రయత్నం చేయాలని తనదైన శైలిలో తెలియజేశాడు

Recommended Video

RRR లో మల్లి..ఎవరీ చిట్టితల్లి? Twinkle Sharma లైఫ్ మలుపు తిప్పిన యాడ్ | Filmibeat Telugu
 'నీ మొహం రా'

'నీ మొహం రా'

అయితే కెఏ.పాల్ ఆ విధంగా స్పందించడంతో విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ సోషల్ మీడియాలో ఎవరూ ఊహించని విధంగా రియాక్షన్ ఇచ్చాడు. 'నీ మొహం రా' అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేయడం వైరల్ గా మారింది. గతంలోనే చాలాసార్లు కే ఏ పాల్ కు సంబంధించిన స్టేట్మెంట్స్ పై సెటైర్లు కూడా వేయడం జరిగింది. ఇక ఇప్పుడు మరోసారి RRR మూవీ తనకు తెలియదు అన్నట్లుగా స్పందించడంతో వర్మ ఈ విధంగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మరి వర్మ కౌంటర్ పై మళ్ళీ కె.ఏ.పాల్ ఏదైనా సమాధానం ఇస్తాడో లేదో చూడాలి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X