పక్కా నేటివిటితో అంతిమ తీర్పు.. సాయి ధన్సిక, అమిత్ తివారీ కాంబినేషన్లో..!
తెలుగు నేటివిటితో వచ్చే సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఎప్పడూ మంచి ఆదరణ ఉంటుందని ఇటీవల వచ్చిన చిత్రాలు నిరూపించాయి. పక్కా గ్రామీణ నేపథ్యంగా వస్తున్న అంతిమ తీర్పు చిత్రం కూడా కంటెంట్ ప్రధానంగా సాగుందనే విషయాన్ని చిత్ర యూనిట్ వెల్లడించింది. శ్రీ సిద్ధి వినాయక మూవీ మేకర్స్ బ్యానర్‌పై సాయి ధన్సిక, బిగ్‌బాస్ తెలుగు ఫేమ్, నటుడు అమిత్ తివారి కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం అంతిమ తీర్పు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య వద్ద దర్శకత్వ శాఖలో అనుభవం సాధించిన ఏ అభిరాం దర్శకత్వం వహిస్తున్నారు. డీ రాజేశ్వరరావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కథ, కథనాలకు పెద్ద పీట వేసిన ఈ చిత్ర బృందం టైటిల్ లాంచ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా
నిర్మాత రాజేశ్వర్ రావును కలిసినప్పుడు ఆయనలో సినిమా అంటే ఒక తపనను చూశాను. మంచి సినిమా నిర్మించాలనే తపన ఆయనలో కనిపించింది. ఇలాంటి నిర్మాతలు సినిమా పరిశ్రమకు ఎంతో అవసరం అని అమిత్ తివారీ అన్నారు.

ఏ సినిమాకైనా మంచి సపోర్ట్ ఇచ్చేది మీడియా వాళ్ళే, ఈ సినిమా వేడుకకు వచ్చిన మీడియా వాళ్లకు పెద్ద థాంక్స్. ఒక సినిమాకి ప్రొడ్యూసర్ ఎంత అవసరం అనేది ఈ సినిమా చేస్తున్నప్పుడే నాకు అర్ధమైంది. మంచి కథతో మీ ముందుకు వస్తున్నాం. ఎప్పటిలానే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నాం అని సాయి ధన్సిక అన్నారు.
ప్రముఖ దర్శకులు ముత్యాల సుబ్బయ్య సినిమాలకు నేను పనిచేశాను. ఈ సినిమా కథ గ్రామీణ నేపథ్యంగా సాగుతుంది. ఈ చిత్రంలో సాయి ధన్సిక అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో అమిత్ తివారి, నాగమహేష్ మంచి పాత్రలు వేశారు. కోటి మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అవుతుంది. నిర్మాత డీ రాజేశ్వరరావు అనుసరించిన నిర్మాణ విలువలు బాగున్నాయి అని దర్శకుడు అభిరాం అన్నారు.
నటీనటులు: సాయి ధన్షిక, విమల రామన్, దీపు, సత్య ప్రకాష్, గణేష్ వెంకట్ రామన్, అమిత్ తివారీ, చిత్రం శ్రీను, నాగ మహేష్, కోటేష్ మానవ్ తదితరులు
దర్శకుడు: ఏ అభిరాముడు
నిర్మాత: డీ రాజేశ్వరరావు
సినిమాటోగ్రఫి: ఎన్ సుధాకర్ రెడ్డి
సంగీతం: కోటి
ఎడిటర్: గ్యారీ బీ హెచ్
ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, దేవరాజ్
కొరియోగ్రఫి: ఈశ్వర్ పి
కో డైరెక్టర్: బండి రమేష్
ఆర్ట్: వెంకట్
మేకప్: వెంకట్ బాల
కాస్ట్యూమ్: రమేష్
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పీ శ్రీనివాస్


Click it and Unblock the Notifications











