80 ఏళ్ల వయసులో నాలుగో భార్యతో నటుడి షికార్లు... నడిరోడ్డుపై అలాంటి ఫోజుల్లో...

ప్రేమకు వయసుతో సంబంధం లేదని పలువురు నటీనటులు నిరూపిస్తున్నారు. లేటు వయసులోనూ ప్రేమలో పడటం, పెళ్లిళ్లు చేసుకోవడంతో స్టార్స్ వార్తల్లో నిలుస్తున్నారు. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకుంటున్నారు. అటు బాలీవుడ్ హాట్ బాంబ్ మలైకా అరోరా ఎప్పుడు ఎవరితో ప్రేమలో పడతారో? ఎవరితో బ్రేకప్ చెబుతారో తెలియక అభిమానులు టెన్షన్ పడుతుంటారు. తన కొడుకు వయసున్న కుర్రాళ్లతో లేటు వయసులో రొమాన్స్ చేస్తున్నారు మలైకా. ఈ విషయంలో ఎవరెన్ని విమర్శలు చేసినా ఏమాత్రం పట్టించుకోవడం లేదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా 80 ఏళ్ల ఓ సీనియర్ నటుడు తన నాలుగో భార్యతో కలిసి రోడ్లపై షికార్లు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

Also Read
'నా జీవితం టీవీలో హెడ్‌లైన్‌ కావొద్దు... అమ్మాయిలకు ఆ 2 నిమిషాలే’
'నా జీవితం టీవీలో హెడ్‌లైన్‌ కావొద్దు... అమ్మాయిలకు ఆ 2 నిమిషాలే’

బాలీవుడ్ సీనియర్ నటుడు కబీర్ బేడీ.. తన నటనతో పాటు వ్యక్తిగత జీవితంతోనూ వార్తల్లో నిలుస్తున్నారు. అవిభక్త భారతదేశంలోని లాహోర్‌లో జన్మించారు కబీర్ బేడ. అయితే దేశ విభజనతో వీరి కుటుంబం భారత్‌కు వలస వచ్చింది. నైనిటాల్, ఢిల్లీలలో చదువుకున్నారు కబీర్. 1971లో హల్‌చల్ అనే సినిమాతో హిందీ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టరు. ఖూన్ భారీ మాంగ్, మైన్ హూ నా, కైట్స్, షో మ్యాన్, బ్లూ తదితర చిత్రాలలో నటించారు కబీర్ బేడీ. తెలుగులో పైసా వసూల్, హరిహర వీరమల్లు సినిమాలో నటించారు.

Kabir Bedi Enjoys Married Life With Fourth Wife Parveen Dusanj Viral Videos Win Hearts

సినిమాలే కాదు.. టెలివిజన్‌లోనూ సత్తా చాటారు కబీర్ బేడీ. 1976లో యూరోపియన్ టీవీ మినీ సిరీస్‌లలో జయకేతనం ఎగరవేసి యూరప్‌లో స్టార్‌గా వెలుగొందారు. బాలీవుడ్‌లో నటుడిగా కొనసాగుతూనే దాదాపు 30 ఏళ్ల పాటు ఇంగ్లీష్ సిరీస్‌లలో నటించి మెప్పించారు. గంగా కీ ధీజ్, బుద్ధా తదితర హిందీ సీరిస్‌లలో నటించారు. వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా ఎన్నో ఇంగ్లీష్ వాణిజ్య ప్రకటనలకు గాత్రదానం చేశారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌స్‌కు ఓటింగ్ మెంబర్‌గా వ్యవహరించారు. అలాగే స్క్రీన్ యాక్టర్ గిల్డ్‌గా కూడా ఓటింగ్ మెంబర్‌గా పనిచేశారు కబీర్ బేడీ. ఇటలీ ప్రభుత్వం నుంచి ఆర్డర్ ఆఫ్ మెరిట్ ఆఫ్ ది ఇటాలియన్ రిపబ్లిక్ పురస్కారాన్ని అందుకున్నారు.

Recommended For You
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్
నా బిడ్డకు తండ్రి ఆ హీరోయే... జడ్జి ముందు నటి హల్‌చల్

ఇక కబీర్ బేడీ వైవాహిక జీవితం మాత్రం ఏమాత్రం ఆశాజనకంగా సాగలేదు. తొలుత ప్రొతిమ గౌరిని 1969లో పెళ్లి చేసుకున్నారు కబీర్ ఆమెకు 1974లో విడాకులిచ్చారు. అనంతరం 1980లో సుసాన్ హంప్రేయాస్‌ను 1980లో పెళ్లి చేసుకున్నారు, పదేళ్ల పాటు వీరి కాపురం సజావుగానే సాగింది. అనంతరం ఈ బంధం కూడా విడాకులతో ముగిసిపోయింది. ఆ వెంటనే నిక్కీ మూల్గాకర్‌ను పెళ్లాడి 2005లో ఆమెకు విడాకులిచ్చారు కబీర్ బేడీ. అయితే 2016లో ఆయన 70వ పుట్టినరోజు సందర్భంగా తీసుకున్న నిర్ణయం అత్యంత వివాదాస్పదమైంది.

You May Also Like
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’
'ఆ యాంకర్ బెడ్ నిండా అవే... ఈ టైంలో మొగుడితో ఉండాలి కానీ’

తన కంటే 30 ఏళ్లు చిన్నదైన పర్వీన్ దుసాంజ్‌ను కబీర్ నాలుగో సారి పెళ్లి చేసుకున్నారు 2005లో వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమగా మారి, దాదాపు 10 ఏళ్ల పాటు ఇద్దరూ డేటింగ్ చేశారు 2011లో రోమ్‌లో తన మనసులోని మాటను కబీర్ బయటపెట్టారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సమక్షంలో 2016 జనవరి 15న ముంబైలో కబీర్ బేడీ, పర్వీన్ దుసాంజ్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా గడుపుతూ .. ఈ వయసులోనూ వైవాహిక బంధాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ముంబై రోడ్లపై కబీర్ - పర్వీన్‌లు షికార్లు చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. భర్త చేతిలో చేయ్యేసి నవ్వుతూ కనిపించడంతో పాటు ఆయనతో కలిసి ఫోటోలకు ఫోజులిచ్చారు పర్వీన్. ప్రేమకు, బంధానికి ఎలాంటి వయసు లేదని వీరిద్దరూ నిరూపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X