ఆ కుక్కలు అలా మొరుగుతూనే ఉన్నాయి.. ఆ ముగ్గురిపై ముంబై నటి కాదంబరి జెత్వానీ ఆరోపణలు
ముంబై నటి కాదంబరి జెత్వానీ వివాదాస్పద కేసులో పురోగతి కనిపిస్తున్నది. ఏపీ పోలీసులకు నటి తన స్టేట్‌మెంట్‌ను ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. కుక్కల విద్యాసాగర్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.అంతేకాకుండా ముగ్గురు ఉన్నత పోలీసు అధికారులపై చేసిన ఆరోపణలు సంచలనం రేపాయి. ఆమె చెప్పిన వివరాల్లోకి వెళితే..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత నాకు జరిగిన అన్యాయంపై స్పందించినందుకు ధన్యవాదాలు. నాపై పైశాచిక చర్యలు విన్న తర్వాత నాకు సహకారం అందించేందుకు సిద్దమయ్యారు. విజయవాడ కమిషనర్ నేను చెప్పిన విషయాలు కూలకుషంగా విన్నారు. నాకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.నేను ఓ దారుణ పరిస్థితి నుంచి బయటకు వచ్చేలా.. నాకు ఉపశమనం పొందేలా చేశారు అని కాదంబరి జెత్వానీ అన్నారు.

విద్యాసాగర్, ఇతర వ్యక్తులు నాపై అనేక కుట్రలు పన్నుతున్నారు. హానీ ట్రాప్ అంటూ కట్టు కథలు అల్లుతున్నారు. ఇంకా చాలా కుక్కలు మొరుగుతునే ఊన్నాయి. విద్యాసాగర్ ఇంకా నాపై దుష్ప్రచారం చేస్తూ.. అనేక మంది ప్రముఖులను ఈ వివాదంలోకి లాగుతున్నారు.
గతంలో నాకు ఒక వ్యక్తితో అరెంజ్డ్ మ్యారేజ్ కోసం ప్రపోజల్ జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ముందుకు వెళ్లలేదు. అయితే అతడిపై నేను కేసు నమోదు చేయలేదు. అతడు నాపై కేసు నమోదు చేయలేదు. ఆ విషయంలో ఎలాంటి డబ్బు ప్రస్తావన రాలేదు అని అన్నారు.
భూమి అమ్మకం విషయంలో నేను ఇద్దరిపై కేసు నమోదు చేశానని చెప్పారు. కానీ విద్యాసాగర్‌పైనే ఆ ఇద్దరు కంప్లైంట్ చేశారు. వారి ఓ భూమి అమ్మకం విషయంలో ఆధార్ కార్డు ఇస్తే.. దానిని దుర్వినియోగం చేశారు. నా ఆధార్ కార్డును కూడా దుర్వినియోగం చేశారు.
ఏపీకి చెందిన 15 మందికి పైగా లగ్జరీ వాహనంలో వచ్చి ముంబై నుంచి మమ్మల్ని కిడ్నాప్ చేశారు. మమ్మల్ని ముంబై నుంచి తీసుకు రావడంలో క్రాంతి రాణా కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత విశాల్ గున్యా ఈ మిషన్‌ను అమలు చేశాడు. అలాగే ఇంటెలిజెన్స్ డీజీ కూడా ఈ కుట్రలో ఉన్నారనే విషయం నా దృష్టికి వచ్చింది. అయితే వారి పాత్ర ఎంత వరకు ఉందనే విషయం దర్యాప్తులో తేలుతుంది అని అన్నారు. ప్రభుత్వ దర్యాప్తులోనే రాజకీయ కుట్ర ఉందా? అనేది తేలుతుంది అని అన్నారు.


Click it and Unblock the Notifications











