జానీ మాస్టర్ తర్వాత.. హీరోయిన్‌ వేధింపుల కేసులో ప్రముఖ వ్యక్తి అరెస్ట్.. 14 రోజుల రిమాండ్!

తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ లైంగిక వేధింపుల దాడి కేసు సంచలనం రేపుతుంటే.. బాలీవుడ్ నటి కాదంబరి జెత్వానీ కేసులో ఓ కీలక వ్యక్తిని అరెస్ట్ చేయడం మరో సంచలనంగా మారింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ఉత్తరాదిలో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన అరెస్టులు, ఇతర విషయాల వివరాల్లోకి వెళితే..

దేశంలో ఓ టాప్ పారిశ్రామిక వేత్త నుంచి వెధింపులు ఎదుర్కొన్న కేసులో ముంబై నటి వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు తలదూర్చారు. అయితే ఎలాంటి ఫిర్యాదు లేకుండానే సదరు నటిని ముంబైలో అరెస్ట్ చేసి హుటాహుటిన విజయవాడకు తరలించారు. ఈ అరెస్ట్ తర్వాత ఆమెను ఓ గెస్ట్ హౌస్‌లో బంధించి వేధించారు.

Kadambari Jetwani Case YSRCP Leader Kukkala Vidyasagar remanded for 14 days

ఈ కేసులో ఉన్నతాధికారులు చట్టం పరిధిని మించి ముంబై నటిని అరెస్ట్ చేశారు. దాదాపు 45 రోజుల పాటు జైలులో ఉంచారు. అనంతరం బెయిల్‌పై వచ్చిన ఆమె ముంబైకి వెళ్లిపోయింది. అయితే ఏపీలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపింది.

ముంబై నటి కేసులో చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన ముగ్గురు ఉన్నతాధికారులు సీతారామాంజనేయులు, విశాల్ గున్నీ, క్రాంతి రాణా టాటాపై సస్పెన్షన్ వేటే వేసింది. అయితే ఈ నటిపై అక్రమ కేసును నమోదు చేసిన వైసీపీ నేత, వ్యాపార వేత్త కుక్కల విద్యాసాగర్ కోసం వేట ప్రారంభించారు. చివరకు డెహ్రాడూన్‌లో ఆయనను అరెస్ట్ చేసి ఏపీకి తీసుకొచ్చారు.

Kadambari Jetwani Case YSRCP Leader Kukkala Vidyasagar remanded for 14 days

కాదంబరి జెత్వానీ కేసులో అరెస్ట్ చేసిన కుక్కల విద్యాసాగర్‌ను కోర్టులో ప్రవేశపెట్టగా అతడిని విచారించింది. అనంతరం ఆయనకు 14 రోజుల రిమాండ్‌కు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాతో ఆయన రాజమండ్రి జైలుకు తరలించినట్టు సమాచారం. ఈ వ్యవహారం మరోసారి సంచలనం రేపింది.

ముంబై నటి కాదంబరి జెత్వానీ కేసులో లోతైన దర్యాప్తు జరుగుతున్నది. ఈ కేసులో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని అధికారులు, సీఎంవో నుంచే ఈ స్కెచ్ నడిసిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు పోలీసులు, వ్యాపార వేత్తలకే చుట్టుకొన్న ఈ కేసు రాజకీయ నేతల మెడకు బిగుసుకొనే అవకాశం ఉందని తెలుస్తున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X