twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దటీజ్ వైఎస్ జగన్.. మాట నిలబెట్టుకొన్నావు.. ఏపీ సీఎంపై కైకాల సత్యనారాయణ ప్రశంసలు

    |

    టాలీవుడ్‌ సినీ దిగ్గజం, మాజీ ఎంపీ కైకాల సత్యనారాయణ అనారోగ్యం నుంచి కోలుకొని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి భావోద్వేగమైన లేఖ రాశారు. గత నవంబర్ నెలలో కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తనకు, తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికి కైకాల కృతఙ్ఞతలు తెలియజేసుకొంటూ లేఖ రాశారు. ఆ లేఖలో ఏపీ సీఎం వైఎస్ జగన్ గురించి ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కైకాల రాసిన లేఖ వివరాల్లోకి వెళితే..

     గత నవంబర్‌లో హాస్పిటల్‌లో

    గత నవంబర్‌లో హాస్పిటల్‌లో

    దేశం గర్వించదగిన నటుడు, నిర్మాత కైకాల సత్యనారాయణ కొద్ది రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్‌లో చేరారు. ఆయన పరిస్థితి ఓ దశలో విషమంగా మారింది. దాంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రతీ ఒక్కరు ప్రార్థనలు చేశారు. గత ఏడాది నవంబర్‌లో అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందడం, అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తి స్థాయిలో మెరుగుపడింది. ఈ సందర్భంగా తాను ఆసుపత్రిలో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మేరకు ఏపీ సీఎంకు లేఖ రాశారు.

    వైఎస్ జగన్‌ కాల్ చేసి..

    వైఎస్ జగన్‌ కాల్ చేసి..

    అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన సమయంలో నా కుటుంబానికి అండగా నిలిచారు. హాస్పిటల్‌లో ఉన్న సమయంలో తనకు అందించిన అమూల్యమైన సహాయం అందించారు. బిజీ షెడ్యూల్‌లో ఉన్నప్పటికీ, వ్యక్తిగతంగా కాల్ చేసి, ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మీరు చూపిన శ్రద్ధకు నేను చాలా సంతోషిస్తున్నాను. మీరు హామీ ఇచ్చినట్టుగానే మీ ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు, వైద్య ఖర్చులను తీర్చడానికి ఆర్థిక సహాయంతో సహా అన్ని రకాల సహాయాన్ని అందించారు అని ఏపీ సీఎం జగన్‌కు రాసిన లేఖలో కైకాల తెలిపారు.

    మీ సహాయం అద్బుతమైన శక్తి ఇచ్చిందని..

    మీ సహాయం అద్బుతమైన శక్తి ఇచ్చిందని..

    హాస్పిటల్‌లో కష్ట సమయాల్లో ఉన్నప్పుడు మీ సహాయం నాకు, నా కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చింది. మీరు చూపిన చొరవ మీకు కళాకారులు, వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసింది, ప్రజల పట్ల మీకు ఉన్న శ్రద్ధ రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుంది. అనారోగ్యం పాలైనప్పటి నుంచి అండగా ఉన్నందుకు నేను మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను అని వైఎస్ జగన్‌పై కైకాల సత్యనారాయణ ప్రశంసల వర్షం కురిపించారు.

    స్వయంగా సంతకం చేయలేకపోతున్నా

    స్వయంగా సంతకం చేయలేకపోతున్నా

    ప్రస్తుతం పరిస్థితుల్లో ఆరోగ్యంతోనే ఉన్నాను. మీకు రాసిన లేఖలో స్వయంగా సంతకం చేయలేక పోతున్నాను. నా కుమారుడు కొడుకు నేను రాసిన లేఖపై సంతకం చేశారు. తన ఆరోగ్యం సహకరించని సమయంలో తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మాములు మనిషిని చేశాయి అని కైకాల సత్యనారాయణ తన లేఖలో పేర్కొన్నారు.

    English summary
    Actor, Producer and Politician Kaikala Satyanarayana appreciation letter YS Jagan Mohan Reddy over help while when he was hospitalised. He congrats to Ys Jagan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X