సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గారికి అస్వస్థత.. క్లారిటీ ఇచ్చిన కుటుంబ సభ్యులు

తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత సీనియర్ నటీనటుల లో కైకాల సత్యనారాయణ గారు ఒకరు. అయితే ఇటీవల ఆయన కొంత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యంపై కూడా గత కొంత కాలంగా అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. ఇక ఆ విషయంలో సత్యనారాయణ కుటుంబ సభ్యులు ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఇటీవల మరొకసారి ఆయన అస్వస్థతకు గురి అయినట్లు చెబుతూ.. వెంటనే ఆ విషయంపై వివరణ ఇచ్చారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు అభిమానులు ఆందోళ చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.

60 ఏళ్ళ అనుభవం

60 ఏళ్ళ అనుభవం

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న కైకాల సత్యనారాయణ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు. కేవలం విలన్ గానే కాకుండా పాజిటివ్ రోల్స్ చేయడంలో కూడా ఆయన మంచి క్రేజ్ అందుకున్నారు. పాత్ర ఎలాంటిదైనా సరే కూడా తనదైన టైమింగ్ తో ఆకట్టుకుంటు వచ్చారు. 1959 నుంచి చి కైకాల సత్యనారాయణ తెలుగు చిత్ర పరిశ్రమలో కొనసాగుతూ వస్తున్నారు. 60 ఏళ్ళుగా నటుడిగా కొనసాగుతూ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.

750కి పైగా సినిమాలు

750కి పైగా సినిమాలు

దాదాపు 750కి పైగా సినిమాలలో నటించిన కైకాల సత్యనారాయణతో బ్లాక్ అండ్ వైట్ కాలం నటులు నుంచి నుంచి నేటి కలర్ఫుల్ యువ హీరోల వరకు కూడా చాలామంది స్క్రీన్ షేర్ చేసుకున్న వారే. ఎలాంటి సినిమా చేసినా కూడా కైకాల సత్యనారాయణ నటన ఆ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆయనంటే సినిమా ఇండస్ట్రీలో దాదాపు అందరికి కూడా ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. అలాగే ఇప్పటికి కూడా తరచుగా ఆయనను కలుస్తుంటారు ఇక ఆయనను కలుసుకునేందుకు వచ్చిన అభిమానులు కూడా ఎంతో ఆప్యాయంగా ఓపికతో మాట్లాడుతూ ఉంటారు.

ఆందోళ చెందాల్సిన అవసరం లేదు

ఆందోళ చెందాల్సిన అవసరం లేదు

ఇక 86 ఏళ్ల వయసులో కూడా కైకాల సత్యనారాయణ ఇటీవల కొంత అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆ విషయంపై ఎక్కువగా రూమర్స్ రాకముందే వారి కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సికింద్రాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించిన కుటుంబ సభ్యులు పెద్దగా ఆందోళ చెందాల్సిన అవసరం లేదని కూడా తెలియజేశారు.

ఇడియట్ సినిమా తరువాత

ఇడియట్ సినిమా తరువాత

సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ కూడా కూడా మూడు తరాల వారు కైకాల సత్యనారాయణ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మొదటి నుంచి కూడా ఆయన ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అయితే 2002 ఇడియట్ సినిమా అనంతరం కైకాల సత్యనారాయణ చాలావరకు సినిమాలలో నటించడం తగ్గించేశారు. కొన్ని ఆరోగ్య కారణాల వలన మునుపటి తరహాలో సినిమాలు చేయడానికి ఒప్పుకోలేదు.

Recommended Video

Megastar Chiranjeevi Birthday Wishes To Kaikala Satyanarayana ​| Filmibeat Telug
 చివరగా ఆ సినిమాలో..

చివరగా ఆ సినిమాలో..

ఒకవైపు ఆరోగ్యాన్ని చూసుకుంటూ మరొకవైపు తనకు ఎంతో ఇష్టమైన నటనను కూడా కొనసాగిస్తూ వచ్చారు. 2002 తరువాత ఏడాదికి ఒక్క సినిమా చేసుకునేలాగా తన షెడ్యూల్ ను ప్లాన్ చేసుకుంటూ వచ్చారు. ఇక చివరగా 2019లో ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహేష్ బాబు మహర్షి సినిమాలో నటించారు. ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ మొదలవ్వడంతో సినిమాలు చేసేందుకు నిరాకరించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X