For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Kaikala Satyanarayana no more గుండె ముక్కలైంది.. దురదృష్టకరం.. బాలకృష్ణ, మహేష్, రాంచరణ్, నాని ఎమోషనల్

  |

  నవరస నటనాసార్వభౌమ కైకాల సత్యనారాయణ ఇక లేరు. గత కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత, ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమ దిగ్బ్రాంతికి గురైంది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలను స్మరించుకొంటూ తమ అనుభూతులను పంచుకొంటున్నారు. తిరిగిరాని లోకాలకు వెళ్లిన కైకాలకు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ..

  నందమూరి బాలకృష్ణ భావోద్వేగం

  కైకాల సత్యనారాయణ గారి మరణం దిగ్భ్రాంతి కలిగించింది. కైకాల సత్యనారాయణ గారు ఆరు దశాబ్దాలు పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారు. మా కుటుంబంతో కైకాల సత్యనారాయణ గారికి స్నేహ సంబంధాలు వున్నాయి. నాన్నగారితో కలిసి ఎన్నో సినిమాల కోసం పనిచేశారు. నా చిత్రాల్లో కూడా మంచి పాత్రలు పోషించారు. మంచి నటుడిగానే కాకుండా పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్రవేశారు. సినీ జీవితంలోనూ, ప్రజాజీవితంలోనూ ఎంతో బాధ్యతాయుతంగా ఆయన అందించిన సేవలు మరువలేనివి. ఈ రోజు ఆయన మన మధ్య లేకపోవడం ఎంతో దురదృష్టకరం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

  తిరిగి రాని లోకాలకు వెళ్లారంటూ వరుణ్ తేజ్

  తిరిగి రాని లోకాలకు వెళ్లారంటూ వరుణ్ తేజ్

  కైకాల సత్యనారాయణ గారి మరణం చాలా బాధాకరం. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం దురదృష్టకరం. ఆయన మృతికి నా ప్రగాఢ సంతాపం. కైకాల కుటుంబానికి మనోధైర్యాన్ని ఇవ్వాలని నేను భగవంతుడిని వేడుకొంటున్నాను. ఓం శాంతి అంటూ వరుణ్ తేజ్ సంతాపం ప్రకటించారు.

  మహేష్ బాబు ఎమోషనల్

  మహేష్ బాబు ఎమోషనల్


  సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ గారి మరణంతో తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యాను. ఆయనతో నాకు అనేక అనుభూతులు ఉన్నాయి. ఆయనతో కలిసి పనిచేసిన క్షణాలు కళ్లముందు కదలాడుతున్నాయి. ఆయన లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఆయన శ్రేయోభిలాషులకు, కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నేను దేవుడ్ని ప్రార్థిస్తున్నాను అని సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు.

  రవితేజ శ్రద్దాంజలి ఘటిస్తూ..

  రవితేజ శ్రద్దాంజలి ఘటిస్తూ..

  లెజెండరీ యాక్టర్ కైకాల సత్యనారాయణ మరణవార్త వినగానే తీవ్ర విషాదంలో మునిగిపోయాను. భారతీయ సినిమా చరిత్రలో ఆయన లాంటి నటుడ్ని ఇప్పటి వరకు చూడలేదు. అలాంటి నటుడ్ని కోల్పోవడం బాధాకరం. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను అని మాస్ మహారాజ్ రవితేజ ట్వీట్ చేశారు.

  గుండె ముక్కలైంది అంటూ నాని

  తెలుగు సినిమా గర్వించదగిన నటుడు కైకాల సత్యనారాయణ మ‌ృతితో నాని దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఆయనకు శ్రద్దాంజలి ఘటిస్తూ.. తెలుగు సినిమా స్వర్ణ యుగంలో నా ఫేవరేట్ నటుల్లో సత్యనారాయణ గారు ఒకరు. ఆయన మరణవార్తతో నా గుండె ముక్కలైంది. మన ఇంట్లో మనిషిలా అనిపించే వ్యక్తి ఆయన. ఆయన చేసిన సినిమాలు లెజెండరీ నటుడిగా మార్చాయి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి అని నేచురల్ స్టార్ నాని అన్నారు.

  రాంచరణ్ ఏమన్నారంటే?

  రాంచరణ్ ఏమన్నారంటే?


  కైకాల సత్యనారాయణ మరణంతో రాంచరణ్ షాక్ గురయ్యాడు. కైకాల మృతికి సంతాపం తెలియజేస్తూ.. సత్యనారాయణ గారి మరణ వార్త నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టింది. తెలుగు సినిమా ఆయన చేసిన కాంట్రిబ్యూషన్ ఎప్పటికీ గుర్తుండి పోతుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని రాంచరణ్ ట్వీట్ చేశారు.

  అత్యంత బాధాకరం అంటూ జయప్రద శ్రద్దాంజలి

  అత్యంత బాధాకరం అంటూ జయప్రద శ్రద్దాంజలి


  కైకాల సత్యనారాయణ గారి మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు ప్రముఖ నటి జయప్రద. ఈ విషాద వార్త తనను తీవ్రంగా కలచి వేసిందని ఆమె పేర్కొన్నారు. "అడవిరాముడు, యమగోల" తదితర ఎన్నో చిత్రాల్లో కలిసి నటించినప్పటి జ్ఞాపకాలను ఆమె నెమరువేసుకున్నారు. నటనకు నిఘంటువు వంటి సత్యనారాయణ స్థానం తెలుగు చిత్రసీమలో చెక్కు చెదరనిదని జయప్రద అన్నారు. కైకాల కుటుంబ సభ్యులకు ఆమె తన ప్రగాఢ సంతాపం తెలిపారు.

  అప్పటి వరకు బతికే ఉంటారు అని మంచు విష్ణు

  అప్పటి వరకు బతికే ఉంటారు అని మంచు విష్ణు

  రాముడు, కృష్ణుడు ఎలా ఉంటాడో మనం చూడలేదు. కానీ మన పౌరాణిక చిత్రాల తో మనకు రాముడైనా, కృష్ణుడైనా నందమూరి తారక రామారావు గారు మాత్రమే అనిపించేలా నటించి తెలుగు ప్రజలకు దేవుడయ్యాడు. అలాగే భీముడు, దుర్యోధనుడు, యముడు అంటే మనకు ఠక్కున గుర్తుకువచ్చేది ఆజానుబాహుడు, హీరోలతో సరితూగే పాత్రలో నటించి మెప్పించగలిగే నటులలో ఒకే ఒక్కరు కైకాల సత్యనారాయణ గారు. ఆయ‌న వేసిన పాత్ర‌లు, చెప్పిన డైలాగులు తెలుగు వాడి గుండెల్లో ప‌దిలంగా ఎప్ప‌టికీ నిలిచే ఉంటాయి. ఎన్నో మహత్తర పాత్రలకు జీవం పోసిన సత్యనారాయణ గారు మన తెలుగు వాడు కావడం విశేషం. తన ఆహార్యం, అభినయం తో అశేష అభిమానుల్ని సంపాదించుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కైకాల సత్యనారాయణ గారు మన మధ్య లేకపోయినా కళామతల్లి ముద్దు బిడ్డగా ఆయన ఎప్పటికీ తెలుగు వారి గుండెల్లో బతికే ఉంటారు అని మంచు విష్ణు ఓ ప్రకటనలో తెలిపారు.

  English summary
  Deeply Saddened by the untimely demise of legendary actor #KaikalaSatyanarayana Garu. His contribution to Telugu Cinema will always be cherished. Sending his family and friends strength in these difficult times. May his soul rest in peace.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X