twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ డైరెక్టర్‌ను ఎందుకు వదులుకొంటా? నాకు అది డ్రీమ్ ప్రాజెక్ట్.. కాజల్

    |

    గత పదేళ్లుగా కాజల్ అగర్వాల్ అందంతోనే కాకుండా అభినయంతో ఆకట్టుకొంటున్నారు. టాలీవుడ్‌లోని అగ్రహీరోలతోపాటు, కుర్ర హీరోలతో కూడా నటించి మెప్పించారు. తాజాగా ఆమె ఇష్టపడి చేసిన సీత చిత్రం నిరాశ పరిచింది. ఆ పరాజయ భారం నుంచి బయటపడి.. ఇప్పుడు రణరంగం చిత్రంలో ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. శర్వానంద్, కల్యాణి ప్రియదర్శినితో కలిసి రణరంగంలో నటించారు. ఈ చిత్రం ఆగస్టు 15వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించింది. కాజల్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

    ఇండియన్ 2 సినిమా నుంచి బయటకు వచ్చాననే వార్తలో నిజం లేదు. శంకర్ దర్శకత్వంలో నటించాలన్నది నా కోరిక. అందులో నా పాత్ర అద్భుతంగా ఉంటుంది. అలాంటప్పుడు నేను ఎందుకు ఆ సినిమాను వదులుకొంటాను? శంకర్ డైరెక్షన్‌లో నటించడం నా డ్రీమ్ అని అన్నారు.

    Kajal Aggarwal about Indian 2 and director Shankar

    నవంబర్‌లో ఇండియన్ 2 సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఇంకా ఆ సినిమా గురించి చాలా మాట్లాడాలని ఉంది. కానీ ఇప్పుడే నేను మాట్లాడలేను. ఆ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకొంటున్నాను. నా లుక్ కోసం కసరత్తు చేస్తున్నాను. గెటప్ ఓరియెంట్ పాత్ర కావడంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను అని కాజల్ తెలిపారు.

    కాగా, అక్టోబర్, నవంబర్ నెలల్లో ఇండియన్ 2 చిత్రం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొనేందుకు సిద్ధమవుతున్నది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ రూపొందిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన షూటింగ్ ప్రారంభనున్నారు. 2021 వేసవిలో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్, ఐశ్వర్య రాజేష్, ప్రియా భవానీ శంకర్ సిద్ధార్థ్, విద్యుత్ జమ్వాల్, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Kajal Aggarwal about Indian 2 and director Shankar
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X