ఆ విషయంలో సన్నీలియోన్‌తో పోటీపడిన కాజల్.. చివరకు పైచేయి ఎవరిదంటే!

బాలీవుడ్ బ్యూటీ, మాజీ శృంగార తార సన్నీలియోన్‌తో పోటీపడింది టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్. చివరకు సన్నీని వెనక్కి నెట్టి తనదే పైచేయి అనిపించుకుంది. ఇంతకీ ఏ విషయంలో అంటారా? భారత దేశంలో 2019 టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ ఫిమేల్ లిస్ట్ ప్రకటించింది సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.

ఈ లిస్టులో మాజీ శృంగార తార సన్నీలియోన్‌తో పాటు టాలీవుడ్ నుంచి కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ చోటు దక్కించుకున్నారు. 2019 టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ ఫిమేల్ లిస్ట్ లో కాజల్ 7వ స్థానంలో నిలవగా, రకుల్ ప్రీత్ సింగ్ 10 స్థానంలో నిలిచింది. ఇక కాజల్ తర్వాతి స్థానం 8ని సన్నీలియోన్‌ దక్కించుకుంది.

Kajal Aggarwal and Rakul Preet Singh In Top Entertainment list 2019 Female

2019 టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ ఫిమేల్ లిస్ట్ మొత్తంగా చూస్తే.. మొదటి స్థానంలో సోనాక్షి సిన్హా, రెండో స్థానంలో అనుష్క శర్మ, మూడో స్థానంలో లతా మంగేష్కర్ నిలిచారు. ఇంకా ఈ టాప్ 10 లిస్టులో ప్రియాంక చోప్రా, ఆలియా భట్, మాధురీ దీక్షిత్ కూడా చోటు దక్కించుకున్నారు.

సీనియర్ హీరోయిన్‌గా ఇప్పటికే 50 సినిమాల మైలురాయిని దాటేసిన కాజల్ అగర్వాల్.. వరుస సినిమా అవకాశాలు పెట్టేస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తోంది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ అయితే తన అందాలతో టాలీవుడ్, బాలీవుడ్ తెరలను వేడెక్కిస్తోంది. ఏదేమైనా 2019 సంవత్సరానికి గాను ఈ ఇద్దరూ టాప్ 10 ఎంటర్‌టైన్‌మెంట్స్ హ్యాండిల్స్ ఫిమేల్ లిస్ట్‌లో చోటు సంపాదించడం అభినందనీయమే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X