మార్చి 30న సర్‌ప్రైజ్ చేయనున్న కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్!
కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ జంటగా నటిస్తున్న చిత్రం సీత. తేజ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నేనే రాజు నేనే మంత్రి చిత్రం తరువాత తేజ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో కథ మొత్తం కాజల్ అగర్వాల్ పాత్ర చుట్టూ తిరుగుతుందని సమాచారం. గత ఏడాది కాజల్, బెల్లంకొండ శ్రీనివాస్ కవచం చిత్రంలో జంటగా నటించారు.
బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ ఆరంభం నుంచి మంచి కమర్షియల్ హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మాస్ హీరోగా ఎదగాలనే కోరిక బెల్లంకొండ శ్రీనివాస్ కు ఇంకా తీరలేదు. డాన్సులు, ఫైట్స్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నా అతడి చిత్రాలు కమర్షియల్ గా సక్సెస్ కావడం లేదు. ఈ బెల్లంకొండ హీరో కోరికని తేజ అయినా తీరుస్తాడో లేదో చూడాలి.

సీత చిత్రాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్లాలని తేజ డిసైడ్ అయ్యాడు. చిత్రీకరణ జరుగుతుండగానే ప్రచార కార్యక్రమాలకు ప్లాన్ చేస్తున్నారు. మార్చి 30న విజయవాడలోని సిధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి ఫెస్ట్ జరగనుంది. ఈ ఫెస్ట్ కు కాజల్ అగర్వాల్, బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు సీత చిత్రయూనిట్ అతిధులుగా హాజరు కానున్నారు. ఈ ఈవెంట్ లో పెద్ద సర్ ప్రైజ్ ఉందని చిత్రయూనిట్ చేబోతోంది.


Click it and Unblock the Notifications











