బాలయ్య డైలాగ్స్‌ను బాంబుల్లా పేల్చిన కాజల్.. ఫ్యాన్స్‌కు కిరాకెత్తించిన సత్యభామ!
గూఢచారి, మేజర్ చిత్రాల విజయాలతో అగ్ర దర్శకుల జాబితాలో చేరిన శశికిరణ్ తిక్క సమర్పకుడిగా మారి రూపొందించిన చిత్రం సత్యభామ. ఆరమ్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రినివాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసి హిట్ జాబితాలో చేరే అవకాశాన్ని దక్కించుకొన్నది. టాలీవుడ్ క్వీన్ కాజల్ అగర్వాల తన రెండో ఇన్నింగ్స్‌లో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్న ఈ చిత్రం ట్రైలర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేడుకలో కాజల్ చేసిన హంగామా గురించిన వివరాల్లోకి వెళితే..
పెళ్లి, ఓ బిడ్డకు తల్లి తర్వాత కాజల్ అగర్వాల్ తన కెరీర్ గ్రాఫ్‌ను ఎవరూ ఊహించిన విధంగా డిజైన్ చేసుకొంటున్నారు. తన రెండో ఇన్నింగ్స్‌లో ఆమె బాలయ్యతో కలిసి నేలకొండ భగవంత్ కేసరి సినిమాలో కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రస్తుతం సత్యభామ అనే చిత్రంలో నటించారు.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ ఈవెంట్‌లో నందమూరి బాలకృష్ణ ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ట్రైలర్‌లోనే కాజల్ తన నట విశ్వరూపాన్ని చూపించారనే విధంగా టాక్ వచ్చింది. ఈ వేడుకలో బాలయ్యతోపాటు అనిల్ రావిపూడి కూడా పాల్గొన్నారు. ఈ వేడుకలో కాజల్ రకరకాల ఎమోషన్ప్‌కు గురయ్యారు.
ఈ వేడుకలో కాజల్ మాట్లాడుతూ.. బాలయ్య మంచి మనసున్న వ్యక్తి. ఎలాంటి ఫిల్టర్లు లేకుండా స్వచ్ఛంగా కనిపించే వారిలో ఒకరు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం రావడం నాకు గర్వంగా ఉంది. ఇక వేడుకకు వచ్చి మా సినిమాకు సూపర్ హిట్ టాక్ వచ్చేలా బజ్ క్రియేట్ చేసినందుకు ధన్యవాదాలు. బాలయ్య ఫ్యాన్స్‌కు మంచి స్పెషల్ ట్రీట్ ఇవ్వాలని అనుకొన్నాను అని కాజల్ ఎమోషనల్ అయ్యారు.

బాలయ్య కోసం నా ట్రిబ్యూట్ అంటూ.. నేలకొండ భగవంత కేసరి చిత్రంలోని పవర్‌ఫుల్ డైలాగ్స్‌ను బాంబుల్లా తన నోటి నుంచి పేల్చింది. ఆ సినిమాలోని జనరంజకమైన డైలాగ్స్.. పతా హై కానోంకే బీచ్ మే బేజా క్యో హోతాహై.. జబ్ కాన్ పే బైరీ పడ్తాహైతో.. బాత్ సీదా బేజా మే గుస్ జాతీ హై అంటూ తనదైన శైలిలో చెప్పి ఆయనకు అభిమానిగా మారారు. చివరల్లో జై బాలయ్య అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
బాలయ్య కోసం కాజల్ చెప్పిన డైలాగ్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. కాజల్ చెప్పిన డైలాగ్స్‌ను ఫ్యాన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు. కాజల్ తన 16 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 60 చిత్రాల్లో నటించింది. ఎంతో మంది హీరోలతో పనిచేసింది. ఇలా బాలయ్య కోసం ప్రత్యేకంగా డైలాగ్ చెప్పడం ఇదే మొదటిసారి. ఈ భామ ముద్దు ముద్దుగా చెప్పిన డైలాగ్స్ నందమూరి అభిమానుల ఇష్టంగా షేర్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











