ఒప్పేసుకున్న కాజల్.. అది నిజమే అంటూ ఓపెన్ అయిన సీనియర్ బ్యూటీ

మెగాస్టార్ చిరంజీవి 152 మూవీ హీరోయిన్ విషయంలో పూర్తి క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా కాజల్ అగర్వాల్ స్వయంగా ఒప్పుకోవడంతో ఇన్నిరోజులుగా ఉన్న సందేహాలకు తెరపడింది. నిజానికి ఈ సినిమాలో చిరంజీవి సరసన త్రిష నటించాల్సి ఉండగా.. ఆమె తప్పుకోవడంతో హీరోయిన్ వేట ప్రారంభించింది చిత్రయూనిట్.

మొదట చిరంజీవి సరసన అనుష్కను తీసుకుందామని భావించిన కొరటాల శివ.. ఆ తర్వాత కాజల్ పేరును పరిశీలనలో పెట్టారు. ఆమెతో సంప్రదింపులు జరిపిన కొరటాల చివరకు కాజల్‌నే ఫైనల్ చేసినట్లు వార్తలు విన్నాం. అయితే తాజాగా కాజల్ ఈ విషయమై స్పందించడంతో చిరంజీవి 152 హీరోయిన్ కాజల్ అని కన్ఫమ్ అయింది.

Kajal Aggarwal clarity on chiranjeevi 152

సోషల్ మీడియా వేదికగా మీరు నటించే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమిటి ? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నపై కాజల్ అగర్వాల్ స్పందిస్తూ.. కమల్ హాసన్‌తో మూవీ, అలాగే బాలీవుడ్ సినిమాతో పాటు చిరంజీవి- కొరటాల శివ సినిమాలో యాక్ట్ చేయబోతున్నట్లు చెప్పింది. దీంతో మెగా అభిమానుల్లో నూతనోత్సాహం నెలకొంది.

గతంలో చిరంజీవి రీ ఎంట్రీ మూవీ 'ఖైదీ నెంబర్ 150' లో కూడా కాజల్ యమ హుషారెత్తించే పర్‌ఫార్‌మెన్స్ ఇచ్చింది. ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ఆమె వేసిన స్టెప్స్ యువతను మత్తెక్కించాయి. సో.. చూడాలి మరి ఈ సారి కాజల్ ఏ రేంజ్‌లో రెచ్చిపోతుందో!.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X