సోదరి బర్త్‌డే.. కాజల్ ఎమోషనల్ పోస్ట్
ఏమైంది ఈవేళ, సుకుమారుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నిషా అగర్వాల్.. పెళ్లి చేసుకుని దూరమైంది. అయితే అక్క కాజల్ అగర్వాల్ అంత స్పీడ్‌గా కెరీర్ సాగకపోవడంతో.. పెళ్లి చేసుకుని సెటిలైంది. అంతేకాకుండా పండంటి బిడ్డకు జన్మనిచ్చి తల్లైంది.
చెల్లెలు పెళ్లి చేసుకుని.. వివాహ జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. కాజల్‌కు పెద్దమ్మగా ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఆ క్షణంలో కాజల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సోషల్ మీడియాలో బేబీతో దిగిన ఫోటోలు షేర్ చేస్తూ.. తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉంటుంది. సినిమాలతోఎంత బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి టైమ్‌ను కేటాయిస్తుంది ఈ చందమామ.

అయితే నేడు నిషా పుట్టినరోజు సందర్భంగా కాజల్ ఎమోషనల్ అయింది. సోషల్ మీడియా ద్వారా చెల్లెలికి విషెస్ చెప్పింది. పసికందుగా ఉన్నప్పటి నుంచి.. నవ్వు ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకు నిన్ను చూస్తున్నా..నీవు కోరుకునే జీవితం నీకు రావాలని.. నిత్యం సంతోషంగా ఉండాలి హ్యాపీ బర్త్‌డే అంటూ ప్రియమైన సోదరికి విషెస్ తెలిపింది.
సినిమా విషయాలకొస్తే.. కాజల్ ప్రస్తుతం సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తూ వస్తోంది. వచ్చిన ప్రతీ ప్రాజెక్ట్‌ను చేయకుండా ఆచితూచి ఎంచుకుంటోంది. రీసెంట్‌గా తేజ దర్శకత్వంలో సీత అనే సినిమాతో టాలీవుడ్‌ను పలకరించింది. అయితే సినిమా సక్సెస్ కాకపోయినా.. కాజల్ నటనకు మంచి ప్రశంసలు లభించాయి. ఇటీవలె తమిళ్‌లో కోమలి సినిమాతో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











