NBK108: బాలయ్యతో స్టార్ హీరోయిన్ ఫిక్స్.. ఊహించని పాత్రతో షాకివ్వబోతుందా!
సుదీర్ఘ కాలంగా టాలీవుడ్‌లో తనదైన సినిమాలతో ప్రేక్షకులకు, ఫ్యాన్స్‌కు మజాను పంచుతూ వస్తున్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. కెరీర్ ఆరంభం నుంచీ హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్న ఆయన.. 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మరింత జోష్‌తో కనిపిస్తున్నారు. ఈ ఉత్సాహంతోనే ఈ సంక్రాంతికి గోపీచంద్ మలినేని తెరకెక్కించిన 'వీరసింహారెడ్డి' అనే సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా ఈ చిత్రం అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు సూపర్ హిట్ అయింది.
'వీరసింహారెడ్డి' షూటింగ్ జరుగుతోన్న సమయంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ.. తన 108వ సినిమాను సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువడింది. ఆ వెంటనే ఈ మూవీ షూటింగ్‌ను మొదలెట్టి ఫస్ట్ షెడ్యూల్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. అలాగే, జనవరి చివరి వారం నుంచే కొత్త షెడ్యూల్ అనుకున్నా.. తారకరత్న పరిస్థితి వల్ల బాలయ్య షూటింగ్‌లో పాల్గొనలేనని చెప్పారు. దీంతో దీనికి కాస్త గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.

క్రేజీ కాంబినేషన్‌లో సరికొత్త నేపథ్యంతో రాబోతున్న ఈ చిత్రంలో నటించే హీరోయిన్ గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్నాయి. ఇందులో బాలయ్యకు జోడీగా ఫలానా హీరోయిన్‌ను తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే ప్రియమణి, ప్రియాంక జావాల్కర్, సోనాక్షి సిన్హా ఇలా ఎన్నో పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్‌ను ఫిక్స్ చేశారట. దీనిపై అతి త్వరలోనే ప్రకటన రానుందని తెలిసింది. ఇక, ఇందులో ఈ బ్యూటీ తల్లి పాత్రను చేస్తుందని కూడా ప్రచారం జరుగుతోంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఆయన కూతురి పాత్రలో నటిస్తుందని అంటున్నారు. ఆమెకు తల్లిగానే కాజల్ చేస్తుందని తాజాగా తెలిసింది. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి.


Click it and Unblock the Notifications











