చూడగానే పులకరించి పోయిన కాజల్.. నోట మాట కూడా రాలేదట
ప్రపంచ సుందరమైన ప్రదేశం, ప్రేమకు చిహ్నం తాజ్ మహల్ చూసి ఫిదా అయిందట కాజల్ అగర్వాల్. ఆమె తాజ్ మహల్ చూడటం ఇదే తొలిసారి కావడంతో వావ్! తాజ్ అనేసిందట కాజల్. ఈ మేరకు తాజ్ మహల్ పరిసరాల్లో తిరిగి ఫోటోలకు పోజిచ్చిన ఆమె.. వాటిని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేస్తూ తాజ్ మహల్ చూశాక తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేది తెలిపింది.
తండ్రి వినయ్‌తో కలిసి తాజ్‌మహల్ చూసేందుకు ఆగ్రా వెళ్లిన కాజల్.. అక్కడి అందాలకు పుకరించిపోయిందట. ఈ మేరకు అక్కడ ఉల్లాసంగా గడిపిన ఫోటోలను తన ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో పోస్ట్ చేసింది కాజల్. ''తాజ్‌మహల్‌ను చూసి పులకరించిపోయా. తొలిసారి తాజ్‌మహల్ అందాలు నన్ను ఫిదా చేశాయి. చూడగానే నోట మాట కూడా రాలేదు. నా జీవితంలో తాజ్ మహల్ గురించి చాలా సార్లు విని ఆశ్చర్యపోయా. తొలిసారి స్వయంగా ఆ ఫీలింగ్స్ ఆస్వాదించా. వండర్ అఫ్ ది వరల్డ్'' అని కాజల్ పేర్కొంది.

ఇక కాజల్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సీత అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డీలా పడింది. ఆ తర్వాత శర్వానంద్ తో కలిసి రణరంగం సినిమా చేస్తే అదీ పెద్దగా కలిసి రాలేదు. అయినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగేయకుండా కొత్త ప్రాజెక్టుల వేటలో ఉందట కాజల్. మరికొద్ది రోజుల్లోనే వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ చేయనుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











