మరో బిగ్ బడ్జెట్ మూవీలో కాజల్ అగర్వాల్.. ఆ సీక్వెల్ కోసం త్యాగం చేయక తప్పలేదు!
టాలీవుడ్ చందమామగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ కాజల్ అగర్వాల్. సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఆమె అందం ఏ మాత్రం తరగలేదు. ప్రతి సినిమాలో తన అందంతో కొత్త కొత్తగా ఆకట్టుకుంటోంది. నేటితరం యంగ్ హీరోయిన్స్ ఎంత మంది వచ్చినా కూడా ఈ బ్యూటీ గ్లామర్ కి సరైన పోటీని ఇవ్వలేకపోతున్నారు.
దాదాపు సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో నటించిన కాజల్ అవసరమైతే సెకండ్ టైమ్ కూడా రొమాన్స్ చేయడానికి సిద్ధమవుతోంది. త్వరలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది. ఇంతకుముందు విజయ్ - కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో తుపాకీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమా విజయం సాధించిన తరువాత కాజల్ దశ తిరిగింది.

తుపాకి హిట్టుతో స్టార్ హీరోయిన్ గా సౌత్ ఇండస్ట్రీలో భారీ ఆఫర్స్ ని అందుకుంటూ వచ్చింది. ఇక అలాంటి సినిమాకు సీక్వెల్ రానుండడంతో దర్శకుడు మురగదాస్ మళ్ళీ కాజల్ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇక తుపాకి సినిమా చాలా స్పీడ్ గా ఫినిష్ చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. లాక్ డౌన్ తరువాత సిద్ధంగా ఉండాలని నటీనటులతో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారట. దీంతో కాజల్ అగర్వాల్ చేతిలో ఉన్న రెండు ఆఫర్స్ ని తుపాకి సీక్వెల్ కోసం వదులుకున్నట్లు తెలుస్తోంది. అంతగా త్యాగం చేసింది అంటే అమ్మడు ఈ ప్రాజెక్టుపై ఏ స్థాయిలో నమ్మకాన్ని పెట్టుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.


Click it and Unblock the Notifications











