అల్లు అర్జున్ సినిమాలో స్పెషల్ సాంగ్.. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు పక్కా

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పీడు పెంచేశాడు. 'నా పేరు సూర్య' తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న బన్నీ.. ఇకపై వరుసగా సినిమాలు చేయాలని డిసైడ్ అయిపోయాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు ఒప్పుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ.. త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల.. వైకుంఠపురములో..' అనే సినిమా చేస్తున్నాడు.

ఇటీవలే ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. అంతేకాదు, ఇందులో బన్నీ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. ఈ సినిమా 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో అతడి సరసన పూజ హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సుమంత్, టబు, నివేథా పేతురాజ్, నవదీప్ తదితర నటులు కనిపించనున్నారు.

Kajal Aggarwal or Rakul Preet Singh will do special song For Allu Arjun

ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ వర్గాల్లో హల్‌చల్ చేస్తోంది. 'అల.. వైకుంఠపురములో..' సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ పెట్టబోతున్నారని తెలుస్తోంది. మంచి కమర్షియల్ ఫైట్ సీన్ తర్వాత ఈ పాట వస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ పాటలో ఎవరు చేస్తున్నారన్న దానిపై ఓ క్లారిటీ వచ్చింది.

ఈ స్పెషల్ సాంగ్ కోసం చిత్ర యూనిట్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ లేదా కాజల్ అగర్వాల్‌ను సంప్రదించబోతున్నట్లు సమాచారం. వీళ్లిద్దరిలో ఎవరు ఒప్పుకుంటే వాళ్లతో సాంగ్ చేయడానికి యూనిట్ సన్నాహాలు చేస్తుందట. ఇప్పటికే కాజల్.. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'జనతా గ్యారేజ్'లో పక్కా లోకల్ అనే పాటకు స్పెప్పులేసిన విషయం తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సాంగ్‌కు ట్యూన్ కట్టే పనిలో బిజీగా ఉన్నాడట. అల్లు అర్జున్ స్పీడుకు తగ్గట్లు ఈ పాటను రెడీ చేస్తున్నాడట.

ఇది పట్టాలపై ఉండగానే 'ఎంసీఏ - మిడిల్ క్లాస్ అబ్బాయి' ఫేమ్ వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో 'ఐకాన్‌' అనే సినిమాను ప్రకటించాడు. ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. స్క్రిప్టు సిద్ధంగా ఉండటం, అది బన్నీకి నచ్చడంతో సినిమా పట్టాలెక్కడమే ఆలస్యమని గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను నిజం చేస్తూ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించేసింది. అయితే, దీని కంటే ముందే సుకుమార్‌ తెరకెక్కించే సినిమాలో బన్నీ నటించనున్నాడని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X