మంచు లక్ష్మీ అరాచకం.. కాజల్‌తో అలా చెప్పించింది

మంచు లక్ష్మీ టాలీవుడ్ సెలబ్రిటీలందరీతో ఎంత క్లోజ్‌గా ఉంటుందో అందరికీ తెలిసిందే. సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు అందరీతో కలుపుగోలుగా మాట్లాడే మంచు లక్ష్మీ.. హీరోయిన్స్‌తో మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ప్రేమతో మీ లక్ష్మీ అంటూ పెద్ద సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి ఎన్నో విషయాలను ప్రేక్షకులకు తెలియజెప్పగా.. ప్రస్తుతం యువ హీరో హీరోయిన్లతో ఫీట్అప్ విత్ ది స్టార్స్ అంటూ మసాలా విషయాలను బయట పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.

సామాజిక మాధ్యమం వూట్ యాప్‌లో ప్రసారమయ్యే ఈ కార్యక్రమంలో సమంత, వరుణ్ తేజ్, శ్రుతీ హాసన్, నిఖిల్, నిధి అగర్వాల్ లాంటి వాళ్లు పాల్గొని తమ జీవితంలో ఎవరికీ తెలియన ఎన్నో సంగతులను బయటకు చెప్పారు. నిఖిల్ అయితే ఏకంగా.. తనకు కాబోయే భార్య గురించి ఎన్నో విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా కాజల్ అగర్వాల్ పాల్గొని ఎన్నో సంగతులను బయట పెట్టింది.

 Kajal Aggarwal Played Different Games In Manchu lakshmi Feet Up With The Stars

తనకు రొమాంటిక్ సీన్స్‌లో నటించడం అంటే నచ్చదని, రానా మంచి స్నేహితుడని ఇలా ఎన్నో సంగతులను వివరించింది. అయితే చివర్లో కాజల్‌తో ఓ డిఫరెంట్ గేమ్ ఆడించింది. నోట్లో పిప్పరమెంట్లను పెట్టుకుని.. జవాబులు చెప్పాలని ఆర్డర్ వేసింది. డైట్ మెయింటెన్ చేస్తున్నానని చెప్పినా మంచు లక్ష్మీ వివరించలేదు. చివరకు ఎలాగోలా కష్టపడి సమాధానాలు చెప్పేసింది. తాను వాటిని తిననని కేవలం మంచు లక్ష్మీ కోసమే ఓకే అన్నానని చెప్పుకొచ్చింది. రామ్ చరణ్‌ను చంపేసి, తారక్‌తో ఉండిపోతానని, ప్రభాస్‌ను పెళ్లి చేసుకుంటానని మంచు లక్ష్మీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది.

తనకు టాలీవుడ్‌లో ఉండే క్రమశిక్షణ ఇష్టమని, కరెక్ట్ టైమ్‌కు షూటింగ్ జరుగుతుందని, ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ చేస్తారని అయితే బాలీవుడ్‌లో మాత్రం అలా కాదని చెప్పుకొచ్చింది. ఒక్కోసారి మధ్యాహ్నం కూడా మొదలుపెడతారని అది తనకు నచ్చదని తెలిపింది. టాలీవుడ్‌లో కథలు హీరో చుట్టు, హీరోయిజం చుట్టూనే తిరుగుతాయని అవి తనకు నచ్చదని.. తమిళ, మళయాల ఇండస్ట్రీలో కంటెంట్ చాలా బాగుంటుందని ఇలా ఎన్నో సంగతులను మంచు లక్ష్మీతో కలిసి పంచుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X