3 రోజులుగా అదే పని.. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటున్నా: కాజల్ షాకింగ్ స్టేట్‌మెంట్
టాలీవుడ్ చందమామ ట్విట్టర్ వేదికగా చేసిన ఓ స్టేట్‌మెంట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఆల్కహాల్ గురించి ఆమె ప్రస్తావించడంతో నెటిజన్లు ఈ ట్వీట్‌ని రీ ట్వీట్స్ కొడుతూ తెగ వైరల్ చేసేశారు. ఇంతకీ కాజల్ చేసిన ఆ ట్వీట్‌లో ఏముంది? ఆల్కహాల్ మ్యాటర్ ఎందుకొచ్చింది? వివరాల్లోకి పోతే..

హీరోయిన్ ఓపెన్ అయింది.. కాకపోతే!!
ఆల్కహాల్ విషయంలో సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓపెన్ అవుతూ ట్వీట్ పెట్టింది. గత మూడు రోజులుగా ఆల్కహాల్ విపరీతంగా తీసుకుంటున్నా అని అందులో పేర్కొంది. దీంతో ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాకపోతే మీరంతా అనుకున్నట్లుగా కాకుండా.. అందులో అర్థం వేరే ఉంది.

కరోనా ఎఫెక్ట్.. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువే
చైనాలో పుట్టిన కరోనా క్రమంగా దేశ విదేశాల్లోకి చొరబడి ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో కాజల్ ఈ ట్వీట్ చేసింది. కరోనా వైరస్ సోకకుండా శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అందరూ ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండే హ్యాండ్ శానిటైజర్స్ వాడుతున్నారు.

అదే పని.. గత మూడు రోజుల్లో ఆల్కహాల్
తాజాగా దీనిపైనే మన కాజల్ అగర్వాల్ సెటైరికల్ ట్వీట్ చేసింది. ఇప్పటిదాకా తాను తీసుకున్న ఆల్కహాల్ కంటే గత మూడు రోజుల్లో తన చేతులను శుభ్రం చేసుకోవడానికి వాడిన ఆల్కహాలే ఎక్కువ అంటూ కాజల్ ట్వీట్ పెట్టింది. ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు వావ్! భలే కామెడీ, నవ్విస్తూనే భలే చెప్పావే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కరోనా ఎఫెక్ట్.. కుదేలైన స్టాక్ మార్కెట్
మరోవైపు కరోనా వైరస్ కారణంగా ప్రపంచ మార్కెట్స్ కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ సహా దేశవిదేశాల్లోని మార్కెలన్నీ కుదేలవుతున్నాయి. దీంతో ఇన్వెస్టర్స్ దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మార్కెట్ నుంచి బయటపడాలా? లేక మరింత పెట్టుబడి పెట్టాలా? అనేది తెలియక సతమతమవుతున్నాడు సగటు మదుపరి.
స్టాక్ బ్రోకర్‌ను అడిగితే.. ఆ మాట అన్నాడు
స్టాక్ మార్కెట్లు ఇలా కుప్పకూలడంపై కూడా ఓ సెటైరికల్ ట్వీట్ వదిలింది కాజల్ అగర్వాల్. ''ఇప్పుడేం ఏం చేస్తే మంచిదని స్టాక్ బ్రోకర్‌ను అడిగితే.. దైవ నామస్మరణ చేయండని చెప్పాడు'' అంటూ సందేశం పోస్ట్ చేసింది. దీంతో ఈ ట్వీట్స్ నెట్టింట సంచలనంగా మారాయి.
Recommended Video


కాజల్ 50.. సీనియర్ హీరోతో
ఇకపోతే ఇప్పటికే 50 సినిమాల మైలురాయిని క్రాస్ చేసిన కాజల్ ప్రస్తుతం.. సీనియర్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో ముంబై సాగా, పారిస్ పారిస్ సినిమాల్లో పాలుపంచుకుంటోంది.


Click it and Unblock the Notifications











