కాజల్ బర్త్ డే స్పెషల్.. సర్‌ప్రైజ్ చేసిన 'రణరంగం' యూనిట్
నేడు (జూన్ 19) అందాల భామ కాజల్ అగర్వాల్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కాజల్ అగర్వాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె కొత్త సినిమా 'రణరంగం' ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. ఈ లుక్‌లో బీచ్ ఒడ్డున యమ జోష్‌లో కనిపిస్తోంది కాజల్.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా 'రణరంగం' ఫస్ట్‌లుక్ షేర్ చేసిన డైరెక్టర్ సుదీర్ వర్మ.. ''కాజల్ అగర్వాల్‌కి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీతో 'రణరంగం' సినిమా రూపొందించడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. భవిష్యత్తు మీరు మరిన్ని మంచి సినిమాలు చేస్తూ ప్రేక్షకలోకాన్ని ఇలాగే ఎంటర్‌టైన్ చేయాలని కోరుకుంటున్నాము'' అని ట్యాగ్ చేశారు. సుదీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'రణరంగం' చిత్రానికి నాగ వంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. చిత్రంలో కాజల్, శర్వానంద్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా అతిత్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక కాజల్ ఇతర సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే 'సీత'తో నెగెటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈమె మళ్లీ అదే దర్శకుడు తేజతో మరో సినిమాకు కమిటయిందని సమాచారం. అలాగే క్వీన్ రీమేక్ చిత్రం లోనూ కాజల్ నటిస్తోంది. దీంతో పాటు మరో తమిళ ప్రాజెక్టు ఆమె చేతిలో ఉందని తెలుస్తోంది. మొత్తానికైతే ఒకప్పుడు అందాల చందమామగా సౌత్ సినిమా ఇండస్ట్రీని ఏలిన ఈ భామ. మళ్లీ బౌన్స్ బ్యాక్ కావాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.


Click it and Unblock the Notifications











