Don't Miss!
- News పవన్ ను ఆడిస్తున్న చంద్రబాబు-పెళ్ళిళ్లే కాదు సీట్లూ నాలుగే- కాకినాడలో జగన్ కామెంట్స్..!
- Sports SRH playing XI: అతనిపై వేటు..ఢిల్లీతో ఆడే తుదిజట్టు ఇదే
- Technology Lava ProWatch లావా ప్రోవాచ్ డిజైన్, ధర వివరాలు లీక్.. ఫంక్షన్ కీ సహా కీలక హెల్త్ ట్రాకర్లు..!!
- Lifestyle ఎండాకాలంలో ఈ ఫుడ్స్‌కు దూరంగా ఉండాలి.. లేదంటే డీహైడ్రేషన్ తప్పదు..
- Automobiles ఈవీ ఓనర్లకు Google Maps గుడ్ న్యూస్.. ఇకపై మీకు ఈ టెన్షన్ ఉండదు.!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఆ పిచ్చి అన్ని చోట్లా ఉంది.. మనం అసలైన ఆనందం పొందేది అప్పుడే.. కాజల్ ఒరిజినాలిటీ ఇదే
నేటి గ్లామర్ ప్రపంచంలో సాధారణ మహిళలే అందానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. ముఖానికి, చేతులకు, కాళ్లకు ఇలా ఎక్కడపడితే అక్కడ మేకప్‌లు వేసుకొని తమ అసలు రూపాన్ని దాచేస్తున్నారు. ఇక హీరోయిన్ల సంగతి చెప్పుకుంటే.. మరీనూ! గ్లామర్‌గా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకోవాలనే బలమైన ఆకాంక్షతో అనుక్షణం మేకప్ తోనే ఉంటున్నారు యంగ్ హీరోయిన్లు. దీనికి తోడు సెక్సీ ఫొటో షూట్స్ కూడా. అయితే అందుకు భిన్నం తాను అని నిరూపిస్తూ ఓ సందేశమిచ్చింది కాజల్. ఆ వివరాలు చూస్తే..
తన అసలు రూపం ఇదీ అంటూ
ముఖం పై రంగులేసుకొని తమ అసలు రూపాన్ని తామే మర్చిపోయే రోజులివి. అలాంటిది సీనియర్ హీరోయిన్ పైగా మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోయిన్ కాజల్ తన అసలు రూపం ఇదే అని చెప్పకనే చెబుతూ తాజాగా ఓ ఫొటో షేర్ చేసింది. ఈ ఫొటో చూస్తే.. ఇన్నాళ్ళుగా మనం చూసిన చందమామ వేరు, ఈమె వేరు అన్నట్లుగా డల్ గానే కనిపిస్తోంది కాజల్ అగర్వాల్.
|
సోషల్ మీడియా చెప్పేదే నిజం అనుకోకండి..
తన అసలు రూపాన్ని బయటపెట్టిన కాజల్.. దానికి తోడు ఆధ్బుతమైన ఓ సందేశాన్ని జత చేసింది. ''ఈ జనం ఎప్పుడూ తమని తాము చేసుకోరు. ఎందుకంటే గ్లామర్ ఒలకబోసే ప్రపంచంలో మనం ఉన్నాం. సోషల్ మీడియా చెప్పేదే నిజం అని అనుకుంటారంతా. సౌందర్య సాధనాల కోసం, బ్యూటీ ఉత్పత్తుల కోసం వందల కోట్ల రూపాయల్ని ఖర్చు చేస్తున్నారు'' అని పేర్కొంది.
ఆ పిచ్చి అన్ని చోట్లా ఉంది
''అందంగా కనిపించాలని భావించే పిచ్చి అన్నిచోట్లా ఉంది. మనం అసలైన ఆనందం పొందేది నిజాన్ని బయటకు చూపించినప్పుడు మాత్రమే. మేకప్ వల్ల వచ్చే అందం మన లోలోపలి క్యారెక్టర్ ని బయటపెట్టదు కదా.. ఎప్పుడైతే మనం అంతర్గంగా లవ్ లీ గా ఉంటామో అదే అసలైన అందం'' అంటూ తన సందేశాన్ని ముగించింది కాజల్ అగర్వాల్. ఆమె పెట్టిన ఈ సందేశం ప్రస్తుతం సెన్సేషన్ అవుతోంది.
ఇంత ఫాలోయింగ్ ఉంది కూడా..
దాదాపు 15 ఏళ్లుగా దక్షిణాది సినీ ఇండస్ట్రీని ఏలుతూ 50 కి పైగా సినిమాలు చేసి, భారీ ఫాలోయింగ్ కూడగట్టుకున్న కాజల్ అగర్వాల్ ఇంత ఓపెన్ గా ఉండటం జనాలను ఆకట్టుకుంటోంది. ఓ హీరోయిన్ అంటే మా చందమామే. మేకప్ ఉన్నా, లేకున్నా ఎలా ఉన్నా మాకు కాజల్ ముద్దుగుమ్మే.. అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు. ఈ రకంగా అందం మనసులో ఉండాలి తప్ప రూపంలో కాదు అని నిరూపించింది కాజల్.