కాజల్ ఛాతిని నొక్కేశారు.. చర్చ ముదురుతోంది.. చివరకు ఏం జరిగేనో మరి!

దశాబ్ద కాలంగా వెండితెరపై పంజాబీ భామ కాజల్ అగర్వాల్ హవా ఏ మాత్రం తగ్గటం లేదు. భాషాబేధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న ఈ భామ ఇప్పటికే హాఫ్ సెంచరీ కొట్టేసి ముందుకు సాగుతోంది. నేటి అప్‌కమింగ్ హీరోయిన్లను మించిన అందం ఈమె సొంతం కాబట్టి క్రేజీ హీరోయిన్‌గా కొనసాగుతూనే ఉంది. ఇక ఇటీవలే 'సీత' రూపంలో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఈ భామ మరికొద్ది రోజుల్లో 'క్వీన్' రీమేక్ మూవీ పారిస్ పారిస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇప్పటిదాకా పర్‌ఫార్‌మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు ప్రాధాన్యమిస్తూ వచ్చిన కాజల్.. ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ చేసిందట. ఈ నేపథ్యంలో తన గ్లామర్ డోస్‌ను పెంచేసి సెట్స్‌పై కదులుతోందట కాజల్. అయితే ఇది నిజమే అని నిరూపించింది ఇటీవలే విడుదలైన 'పారిస్ పారిస్' మూవీ టీజర్. ఈ టీజర్‌లో ఓ సన్నివేశంలో కాజల్ ఛాతిని వేరొక నటి నొక్కడం చూపించి సెన్సేషన్ క్రియేట్ చేశారు మేకర్స్. దీంతో కొన్ని రోజుల పాటు ఈ టీజర్ పై ఓ రేంజ్ చర్చలు నడిచాయి.

ఈ మధ్యనే కాస్త ఆ విషయాన్ని మరచిపోయిన జనాలకు తాజాగా ఇదే అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. సినిమా విడుదల దగ్గర పడటంతో ఈ రేంజ్‌లో బోల్డ్ సన్నివేశాలున్న ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు అనుమతి ఇస్తుందా? లేదా? అనే చర్చ బాగా వినిపిస్తోంది. కాగా ఒకవేళ సెన్సార్ సభ్యులు అనుమతి ఇవ్వలేదంటే ఆ సన్నివేశాలను యూట్యూబ్‌లో రిలీజ్ చేయాలని చూస్తున్నారట మేకర్స్. ఇదే జరిగితే ఇక యూట్యూబ్ లో కూడా కాజల్ హంగామా మామూలుగా ఉండదు మరి!

Kajal Aggarwals Paris Paris controversy

బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ సాధించిన క్వీన్ సినిమాను తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం భాషలలో రీమేక్ చేస్తున్నారు. అయితే తెలుగులో తమన్నా నటిస్తుండగా, తమిళంలో కాజల్, కన్నడలో పారుల్ యాదవ్, మలయాళంలో మంజిమా మోహన్ ఈ రీమేక్ లలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X