twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లోనే కానిచ్చేస్తున్న కాజల్.. అది ఇష్టమా? లేక జాగ్రత్తనా? సీనియర్ బ్యూటీ సెన్సేషన్

    |

    సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే హీరోయిన్స్‌కి ప్రధాన అస్త్రం అందమే అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. ఆ అందాన్ని కాపాడుకుంటూ అవకాశాలు అందిపుచ్చుకోవడమే వారి పని. ఈ మేరకు కాజల్ వ్యవహరిస్తున్న తీరు చూసి షాకైపోతున్నారు ప్రేక్షకులు. ఇంతకీ అందాల చందమామ ఏం చేసింది? వివరాల్లోకి పోతే..

    సీనియర్ బ్యూటీ.. యమ ఫాస్ట్

    సీనియర్ బ్యూటీ.. యమ ఫాస్ట్

    సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉండటం కాజల్ నైజం. ఎప్పటికప్పుడు తన సినిమా విశేషాలు, వ్యక్తిగత సంగతులు అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటుంది ఈ సీనియర్ బ్యూటీ. ఈ నేపథ్యంలోనే తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆమె షేర్ చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

    కరోనా ఎఫెక్ట్.. అంతా ఇంట్లోనే

    కరోనా ఎఫెక్ట్.. అంతా ఇంట్లోనే

    ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అన్ని దేశాల ప్రభుత్వాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపడుతున్నాయి. ఎక్కడికక్కడ రద్దీ ప్రదేశాలు, ఆఫీసులు, సినిమా హాల్స్ క్లోజ్ చేసేశారు. అవకాశం ఉన్న ప్రతీ ఒక్కరూ ఇంట్లో నుంచే పనులు చేసేస్తున్నారు.

    ఇంట్లోనే వర్కవుట్స్.. కాజల్ వీడియో

    ఇంట్లోనే వర్కవుట్స్.. కాజల్ వీడియో

    ఇదే బాటలో కాజల్ కూడా తన అందాన్ని కాపాడుకోవడంలో భాగంగా ఇంట్లోనే వ్యాయామాలు మొదలెట్టేసింది. సినిమా షూటింగ్‌లు, జిమ్‌లు, ఈవెంట్స్ అన్నీ వాయిదా పడటంతో ఇంట్లోనే ఉంటూ తన రోజూవారి పనులను కానిచ్చేస్తోంది కాజల్ అగర్వాల్. ఈ మేరకు తన వర్కవుట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

     ఫిజికల్ ఫిట్‌నెస్.. కాజల్ స్టెప్

    ఫిజికల్ ఫిట్‌నెస్.. కాజల్ స్టెప్

    ఇంట్లో ఉంటూ కూడా తన అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకుంటూ ఇలా వర్కవుట్స్‌ చేస్తున్న కాజల్‌ని చూసి ఆమె ఫ్యాన్స్ తెగ పొగిడేస్తున్నారు. కరోనా ప్రభావం ఉన్నప్పటికీ తమ అభిమాన హీరోయిన్ ఇలా ఇంట్లో ఉంటూనే తన ఫిజికల్ ఫిట్‌నెస్ పట్ల జాగ్రత్త పడుతుండటం నిజంగా గ్రేట్ అంటున్నారు.

    అది ఇష్టమా? లేక జాగ్రత్తనా?

    అది ఇష్టమా? లేక జాగ్రత్తనా?

    ఇంకొందరైతే ఈ కాజల్ వర్కవుట్స్ చూసి.. ఆమెకు వ్యాయామం అంటే ఇష్టమా? లేక వ్యయం చేయకపోతే ఎక్కడ అందం వన్నె తగ్గిపోతుందో అనే జాగ్రత్తనా? అంటూ రియాక్ట్ అవుతున్నారు. ఏదిఏమైనా ఇలా కూడా వర్కవుట్స్ చేయొచ్చని ప్రతీ హీరోయిన్‌కీ కాజల్ ఓ దారి చూపెట్టినట్లే మరి!

    కాజల్ 50.. సీనియర్ హీరోతో

    ఇకపోతే ఇప్పటికే 50 సినిమాల మైలురాయిని క్రాస్ చేసిన కాజల్ ప్రస్తుతం.. సీనియర్ హీరో కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది. అలాగే హిందీలో ముంబై సాగా, పారిస్ పారిస్ సినిమాల్లో పాలుపంచుకుంటోంది.

    English summary
    Kajal Aggarwal latest movie is Bharatheeyudu 2. She is entertain in this movie with kamal hassan. Now she reacts on Corona issue and puts a video on her social media account.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X