సమంత లాగే కాజల్.. దయచేసి స్పందించండి అంటూ అభ్యర్థన
ఈ మధ్యకాలంలో సామాజిక కార్యక్రమాల్లో సినీ సెలెబ్రిటీలు పెద్ద ఎత్తున భాగమవుతున్నారు. వారి పాపులారిటీని దృష్టిలో పెట్టుకొని తమ వంతుగా సామాజిక బాధ్యతలను భుజాలపై వేసుకుంటున్నారు. నిజంగా ఇది అభినందించదగిన విషయం. అయితే ఓ సామాజిక పరమైన అంశంపై ఇటీవలే సమంత స్పందించగా అదే విషయంలో తాజాగా కాజల్ కూడా రియాక్ట్ అవుతూ వీడియో ద్వారా సందేశమిచ్చింది.
కావేరీ కాలింగ్ ఉద్యమంలో భాగంగా సమంత అక్కినేని లక్ష మొక్కలు నాటడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. అందుకు మీ అందరి సపోర్ట్ కావాలంటూ ఇటీవలే సమంత తన అభ్యర్థనను తెలిపింది. ఇప్పడు హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా కావేరీ కాలింగ్ ఉద్యమంలో భాగమవుతూ.. తనతో పాటు తన అభిమానులను కూడా ఉద్యమంలో భాగం కావాలని పేర్కొంది. cauverycalling.org ద్వారా 42 రూపాయలు చెల్లించి ఈ ఉద్యమంలో సామాన్య ప్రజలు కూడా భాగం కావొచ్చని పేర్కొంటూ స్వయంగా తాను మాట్లాడిన వీడియోను ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది కాజల్.

ఈ వీడియోలో మాట్లాడిన కాజల్.. ''నాకు ఎంతగానో నచ్చిన పనిని చేయబోతున్నాను. ఆ విషయాన్ని మీతో పంచుకోవాడనికే ఈ వీడియోతో మీ ముందుకొచ్చాను. కావేరీ నది క్షీణిస్తుండటం కారణంగా నీళ్లు లేక సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఎందరో రైతులు చనిపోతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మనం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగానే 242 కోట్ల మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొంటున్నాను. నాతో పాటు నీరు కూడా ఈ ఉద్యమంలో భాగంకాండి'' అంటూ తన సందేశం ఇచ్చింది కాజల్ అగర్వాల్.


Click it and Unblock the Notifications











