Satyabhama Teaser: దీపావళికి కాజల్ కొత్త సినిమా టీజర్.. సత్యభామగా అసురదహనం!

Satyabhama Teaser Release Date: టాలీవుడ్ చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఇటీవలే నటసింహం నందమూబి బాలకృష్ణతో కలిసి భగవంత్ కేసరి సినిమాలో నటించింది. బాలయ్య బాబుకు జోడీగా కాజల్ ఇరగదీసిందనే చెప్పొచ్చు. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదండోయ్ ఇందులో ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసేందుకు సిద్ధం అవుతుంది.

సుమన్ చిక్కాల దర్శకత్వంలో కాజల్ హీరోయిన్ గా రాబోతున్న ఈ సినిమా పేరు సత్యభామ. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ లు, టైటిల్ లుక్ లు విడుదల చేయగా.. తాజాగా చిత్రబృందం మరో అప్ డేట్ బయటకు వదిలింది. దీపావళి పండుగ సందర్భంగా సత్యభామ సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ముఖ్యంగా నవంబర్ 10వ తేదీన సత్యభామ టీజర్ ను రిలీజ్ అవుతుంది. ఇదే విషయాన్ని జీఎస్ కే మీడియా ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఈ దీపావళికి అసురవదనానికి సత్యభామ సిద్ధం అంటూ రాసుకొచ్చింది.

 Kajal Aggarwal Satyabhama Teaser Released on Deepavali November 10

ఈ పోస్టర్ లుక్ లో బ్లాక్ కలర్ షర్టు వేసుకున్న కాజల్ అగర్వాల్... చేతిలో గన్ తో కనిపించారు. కారుకు ఒరిగి ఉన్న ఈమె.. గన్ ను లోడ్ చేస్తూ కనిపించారు. ఈ పోస్టర్ చూసిన కాజల్ అభిమానులు అంతా తెగ ఎగ్జైట్ అవుతున్నారు. పోలీస్ ఆఫీసర్ లుక్ లో కాజల్ చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తుందని కామెంట్లు చేస్తున్నారు. గతంలో విజయ్ "జిల్లా" సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. కానీ అందులో పవర్ ఫుల్ గా మాత్రం లేదు. కేవలం రొమాన్స్, పాటలకు మాత్రమే ఆమె క్యారెక్టర్ ను పరిమితం చేశారు. కానీ తొలిసారి ఫుల్ లెంత్ పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కాజల్ కనిపించనున్నారు.

సత్యభామ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లిలు నిర్మిస్తున్నారు. అలాగే కాజల్ అగర్వాల్ తో పాటు ఈ సినిమాలో సీనియర్ హీరో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తుండగా.. జి విష్ణు కెమెరామెన్ గా వ్యవహరించనున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి అయిందట. ఎంతో వేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా అందరినీ అలరిస్తుందని పోస్టర్ చూస్తుంటేనే అర్థం అవుతుంది.

 Kajal Aggarwal Satyabhama Teaser Released on Deepavali November 10

మరి నవంబర్ 10వ తేదీన విడుదల కాబోయే ఈ సినిమా టీజర్ ఎలా ఉంటుంది.. ప్రేక్షుకలను మెప్పించి థియేటర్ల వరకూ తీసుకు వెళ్తుందా లేదా అని చూడాలి. సత్యభామ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని చిత్రబృందం ఏర్పాట్లు చేస్తుంది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X