కాజల్ చూడండి ఎలా ముద్దులు పెడుతోందో.. అది కూడా పబ్లిక్‌గా! వీడియో వైరల్
పెరుగుతున్న ఆధునికత సరికొత్త ప్రమోషన్స్‌కి తెర లేపుతోంది. సినీ సెలెబ్రిటీలు తమను తాము ప్రమోట్ చేసుకోవడంలో సోషల్ మీడియాను బాగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్‌కి ఇదో ప్రధాన సాధనంగా మారింది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఓ వీడియో పోస్ట్ చేసి వార్తల్లో నిలిచింది.

15 ఏళ్లుగా అదే పని.. అందరు అగ్ర హీరోలతో
దాదాపు 15 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీని ఏలుతూ వస్తున్న కాజల్.. సౌత్ సినిమాల్లోని అందరు అగ్ర హీరోలతో ఆడిపాడింది. స్టార్ హీరోయిన్‌గా కీర్తించబడుతూ 50 సినిమాలు పూర్తిచేసింది. రెమ్మ్యూనరేషన్ పరంగా కూడా ఒక్కో సినిమాకు కోటిన్నర తీసుకుంటోంది కాజల్ అగర్వాల్. అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదలడం లేదు.

ఈ మధ్యకాలంలో కొంచెం తగ్గించేసింది
సినీ పరిశ్రమ కొత్త హీరోయిన్ల వేటలో పడటం, కాజల్ అగర్వాల్ వయసు కూడా మీద పడుతుండటం కారణంగా అందినన్ని సినిమాలు వెంటనే ఓకే చేస్తోంది కాజల్. అందుకే తన రెమ్మ్యూనరేషన్ విషయంలో కూడా రాజీ పడిందని తెలుస్తోంది. గతంలో కోటిన్నర తీసుకున్న ఆమె.. ఇప్పుడు కోటి ఇచ్చినా ఓకే అనేస్తోందట.
ఎలా ముద్దులు పెడుతోందో చూస్తే..
మరోవైపు సోషల్ మీడియా ప్రమోషన్‌పై కూడా బాగా ఫోకస్ చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇందులో భాగంగా తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియోలో ఒకటి అనే నెంబర్స్ పట్టుకుని, ఒకదానికి ఒకటి ముద్దులు పెట్టిస్తూ.. తాను కూడా ముద్దులు ఇచ్చేస్తుంది కాజల్. దీంతో ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది.

కాజల్ సినిమాలు.. జర్నీ
ఇటీవలే తేజ దర్శకత్వంలో సీతగా ప్రేక్షకుల ముందుకొచ్చిన కాజల్.. ఆశించిన ఫలితం రాబట్టలేక పోయింది. ప్రస్తుతం ఈమె 'పారిస్ పారిస్' చిత్రంలో, అలాగే కమల్ హాసన్ భారతీయుడు 2 సినిమాలో నటిస్తోంది. మరికొద్ది రోజుల్లోనే డైరెక్టర్ తేజతో మరో ప్రాజెక్ట్ చేయనుందని కూడా తెలుస్తోంది. జయాపజయాల సంగతి అటుంచితే.. మొత్తానికి తన వెండితెర ప్రయాణాన్ని సాఫీగా సాగిస్తోంది కాజల్.


Click it and Unblock the Notifications











