కాజల్‌లో ఇంత దమ్ముందా..? ఎలా తన్నిందో చూడండి
అందంతోనే కాదు యాక్షన్ తోనూ ఆకట్టుకోగలనని ఇది వరకే నిరూపించిన పంజాబీ భామ కాజల్ అగర్వాల్.. తాజాగా తనలోని దమ్ము, ధైర్యాన్ని బయటపెట్టింది. ఎగిరితంతే అవతలి వ్యక్తి ఎక్కడో దూరంగా పడిపోయాడు. పక్కన బెల్లంకొండ శ్రీనివాస్ ఉండగానే కాజల్ ఈ పని చేసేసింది. అసలిదంతా ఎక్కడ జరిగిందంటారా? వివరాల్లోకి పోతే..

మోడ్రెన్ సీత కాజల్
తనను తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ తేజ ద్వారానే తనలోని మరోకోణం బయటపెట్టింది కాజల్. మోడ్రెన్ సీతగా ప్రేక్షకుల ముందుకు వస్తూ తన డేర్‌నెస్ అంతా చూపించబోతోంది. ఈ చిత్రంలో హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కంటే కాజల్ డామినేషనే ఎక్కువగా ఉంటుందని విన్నాం. తాజాగా విడుదలైన సీత ట్రైలర్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది.
ట్రైలర్‌లో కాజల్..
సీత చిత్రంలో కాజల్ డామినేషన్ ఉంటుందని విని చాలా మంది హీరోలు ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారట. చివరకు బెల్లంకొండ శ్రీనివాస్ కాజల్ డామినేషన్ ఉన్నా తనకు ఓకే అనేసి ముందుకొచ్చాడు. కాగా తాజాగా విడుదలైన సీత ట్రైలర్ చేస్తే.. కాజల్ డామినేషన్ ఎంతలా ఉందో అర్థమైపోతోంది. ఫైట్ సీన్స్ లో కాజల్ అదరగొట్టేసింది.

కాజల్ ఎగిరితంతే..
మోడ్రెన్ సీతను దర్శకుడు తేజ శివంగిలా తీర్చిదిద్దారు. ఆ రోజుల్లో సీత వనవాసం చేస్తే.. మోడ్రెన్ సీత మాత్రం అందుకు భిన్నంగా అడ్డొచ్చిన వాళ్ళను ఎగిరితన్నేస్తోంది. తాజాగా విడుదలైన సీత ట్రైలర్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ విలన్‌ని ఎగిరి తన్నే సీన్ హైలైట్ అవుతోంది. ఈ ట్రైలర్ లో యాక్షన్ సీన్స్ చూస్తుంటే తేజ ఖాతాలో మరో హిట్ పడ్డట్టే అని తెలుస్తోంది.

సీత ట్రైలర్.. ఆసక్తికర డైలాగ్స్
బెల్లంకొండ శ్రీనివాస్ ఫైట్ సీన్‌తో మొదలైన సీత ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. ‘నా పేరు రఘురామ్.. సీత మా మామయ్య కూతురు.. నేను సీతను చూసుకోవాలి. సీత నన్ను చూసుకోవాలని మామయ్య చెప్పారు' అని బెల్లంకొండ శ్రీనివాస్ చెప్పే డైలాగ్ హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీని తెలియజేస్తున్నాయి. ‘కొట్టు నన్ను కొట్టు.. దమ్ముంటే కొట్టు' అని కాజల్ చెప్పిన డైలాగ్ సీత పవర్ ఏంటో చెప్పేసింది. ఆసక్తికరమైన ఈ ట్రైలర్ విశేష స్పందన తెచ్చుకుంటోంది.

సీత మూవీ
తేజ దర్శకత్వంలో ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీత రూపుదిద్దుకుంది. చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్, మన్నారా చోప్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు, సోను సూద్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఓ రేంజ్ అంచనాల నడుమ మే 24 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


Click it and Unblock the Notifications











