ఐటెం సాంగ్‌తో కాజల్ రీఎంట్రీ: డెలివరీ తర్వాత ఆఫర్ ఇచ్చిన స్టార్ హీరో
టాలీవుడ్‌లో సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి.. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది కాజల్ అగర్వాల్. అందానికి అందం, నటనకు నటన చేస్తూ తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఈ క్రమంలోనే వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఇలా దాదాపు పదేళ్ల పాటు హవాను చూపించిన ఈ చిన్నది.. పెళ్లి తర్వాత కాస్త స్పీడు తగ్గించేసింది. దీనికితోడు ఆ మధ్య కాజల్ అగర్వాల్ గర్భం దాల్చినప్పటి నుంచి సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చేసింది. అంతేకాదు, ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టుల నుంచి కూడా తప్పుకుంది. ఫలితంగా ఆమె కెరీర్‌కు చాలా కాలం పాటే గ్యాప్ వచ్చిందని చెప్పొచ్చు.
చాలా తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న కాజల్‌కు వరుసగా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఆమె సినిమాల మీద సినిమాలు చేసింది. ఇందులో భాగంగానే ఎంతో మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. అలాగే, కొందరు జూనియర్లతోనూ చేసింది. అయితే, ఆమె ఏప్రిల్ 19వ తేదీన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి సినిమాలు చేయడం లేదు. ఇక, తల్లైన తర్వాత కాజల్ తన సమయాన్ని మొత్తం కొడుకు 'నీల్ కిచ్లూ'తోనే గడుపుతోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజులుగా ఆమె కెరీర్‌ను రీస్టార్ట్ చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే కొన్ని ప్రాజెక్టుల కోసం చర్చలు జరిపింది.

దాదాపు ఏడాదికి పైగానే సినిమాలు చేయకుండా ఉన్న కాజల్ అగర్వాల్.. ఇప్పుడు టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వబోతుందని తాజాగా ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ప్రతిష్టాత్మక చిత్రం 'పుష్ప'కు సీక్వెల్‌గా వస్తున్న 'పుష్ప ద రూల్' మూవీలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ చేయబోతుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన టూన్స్‌ను కూడా మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేశాడని కూడా వార్తలు వస్తున్నాయి. గతంలో కాజల్ 'జనతా గ్యారేజ్' మూవీలో పక్కా లోకల్ అనే స్పెషల్ సాంగ్‌ను చేసింది. అది సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు మరోసారి అలా సందడి చేయబోతుందనే టాక్ వినిపిస్తోంది.
'పుష్ప' మూవీ రెండో భాగానికి సంబంధించిన షూటింగ్ చేయనున్నారు. దీనికి 'పుష్ప.. ద రూల్' అనే టైటిల్ పెట్టారు. ఈ విషయాన్ని కూడా సినిమాలోనే తెలిపారు. ఇందులో పుష్ప రూలర్‌గా మారడాన్ని చూపిస్తారు. ఇదిలా ఉండగా.. దీంతో రెండో పార్ట్‌కు సంబంధించిన షూటింగ్‌ను మరింత ఉత్సాహంగా జరపాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. త్వరలోనే దీన్ని ప్రారంభించాలని చూస్తున్నారు.
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన చిత్రమే 'పుష్ప'. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్‌గా నటించింది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్‌గా చేశాడు. సునీల్, అనసూయ ఈ చిత్రంలో నెగెటివ్ రోల్స్‌లో కనిపించారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చాడు. ఇక, 'పుష్ప ద రూల్'లో మరికొందరు ప్రముఖులు నటించబోతున్నారు.


Click it and Unblock the Notifications











