Satyabhama: అల్లాడించిన కాజల్ అగర్వాల్.. ఆ సీన్స్‌లో రెచ్చిపోయిందిగా!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తూ స్టార్లుగా దూసుకుపోతోన్నారు. అలాంటి వారిలో ముందుగా చెప్పుకోవాల్సిన పేరు టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్‌దే. అందం, అభినయంతో ఓ రేంజ్‌లో అలరిస్తోన్న ఈ చిన్నది.. సెకెండ్ ఇన్నింగ్స్‌లోనూ వరుసగా సినిమాలు మీద సినిమాలు చేస్తూ జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.
ఇటీవలే కాజల్ అగర్వాల్ 'భగవంత్ కేసరి' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఆమెలో ఉత్సాహం రెట్టింపు అయింది. ఈ జోష్‌లోనే ఇప్పుడు కాజల్ అగర్వాల్ 'సత్యభామ' అనే సినిమాలో నటిస్తోంది. ఇప్పటికే దీని నుంచి వచ్చిన గ్లింప్స్ వీడియోకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.

యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో రాబోతున్న 'సత్యభామ' సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అప్పటి నుంచి వీలు చిక్కినప్పుడల్లా ఈ మూవీ షెడ్యూళ్లను జరుపుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో అప్పుడప్పుడూ సినిమాకు సంబంధించిన అప్‌డేట్లను కూడా చిత్ర యూనిట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దీని నుంచి టీజర్‌ను విడుదల చేశారు.

కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న 'సత్యభామ' మూవీ నుంచి తాజాగా వచ్చిన టీజర్‌లో ఓ చావు కారణంగా ఉద్యోగం పోగొట్టుకున్న హీరోయిన్.. ఆ తర్వాత ఆ కేసును విచారణ చేయడం చూపించారు. ఈ క్రమంలోనే ఆమెకు ఎన్నో ఊహించని నిజాలు తెలియడం కనిపించింది. మొత్తానికి సత్యభామగా ఈ కేసును ఎలా చేధించింది అనేదే కథ అని అర్థం అవుతోంది.
ఇక, 'సత్యభామ' టీజర్‌లో కాజల్ అగర్వాల్ లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో ఆమె గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ సీన్స్ చేసి అల్లాడించింది. అలాగే, ఈ టీజర్‌లో విజువల్స్ ఎంతో గ్రాండ్‌గా ఉన్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకునే విధంగానే ఉంది. మొత్తానికి 'సత్యభామ' టీజర్‌తో అంచనాలు రెట్టింపు అయిపోయాయి.
మిస్టరీ జోనర్‌లో రాబోతున్న 'సత్యభామ' మూవీని సుమన్ చిక్కల తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని శ్రీనివాసరావు టక్కళ్లపల్లి, బాబీ తిక్క నిర్మిస్తున్నారు. ఇందులో నవీన్ చంద్ర, ప్రకాశ్ రాజ్, నాగనీడు, హర్షవర్ధన్, రవి వర్మ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీతం ఇస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్ కాబోతుంది.


Click it and Unblock the Notifications











