కాజల్‌కు అరుదైన గౌరవం.. మేడమ్ టుస్సాడ్‌లో చందమామ మైనపు విగ్రహం
Recommended Video
మేడమ్ టుస్సాడ్ మ్యూజియంలో మైనపు ప్రతిమను పెట్టడం అంటే మామూలు విషయం కాదు. బాలీవుడ్ నుంచి చాలా మంది నటుల మైనపు విగ్రహాలు అక్కడ ఏర్పాటు చేశారు. అమితాబ్, హృతిక్, కాజోల్, ఐశ్వర్యా రాయ్, షారుక్,కరీనా కపూర్, అనిల్ కపూర్ ఇలా చాలా మంది ప్రముఖ నటుల మైనపు ప్రతిమలను అక్కడ ఏర్పాటు చేశారు. టాలీవుడ్ అందాల చందమామ కాజల్ అగర్వాల్‌కు కూడా ఆ అరుదైన గౌరవం దక్కింది.

టాలీవుడ్ నుంచి అతికొద్ది మందికే..
అయితే ఈ ఘనతను దక్షిణాదికి చెందిన తారల్లో అతి కొద్దిమందే సాధించారు. మేడమ్ టుస్సాడ్‌లో ఇప్పటి వరకు బాలీవుడ్ నటుల మైనపు విగ్రహాలు మాత్రమే ఏర్పాటు చేయగా.. బాహుబలితో దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు.

ఈ మధ్యే మహేష్ బాబు ..
ఈ మధ్యే మహేష్ బాబు మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఆవిష్కరణకు మహేష్ తన ఫ్యామిలీతో కలిసి వెళ్లాడు. అక్కడ వేడుకలో సితార, నమ్రతా, గౌతమ్ ఎంత సందడి చేశారో అందరికీ తెలిసిందే. తాజాగా కాజల్ విగ్రహాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేశారు.

చందమామకు అరుదైన గౌరవం..
టాలీవుడ్ చందమామకు అరుదైన గౌరవం దక్కింది. టాలీవుడ్‌లో అడుగుపెట్టి దశాబ్దం అయినా ఇంకా స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూ సత్తా చాటుతోంది. చెక్కు చెదరని అందంతో కుర్రకారుకు పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా పోస్ట్‌లు పెడుతూ.. ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది.

కాజల్ మైనపు బొమ్మ..
మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో కాజల్ మైనపు విగ్రహాన్ని నేడు ఆవిష్కరించారు. సింగపూర్ లోని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేసిన మైనపు విగ్రహం పక్కన ఫోజిస్తూ నవ్వులు చిందించి కాజల్. టాలీవుడ్ నుండి ఈ అర్హత సాధించిన హీరోయిన్ గా కాజల్ గుర్తింపు పొందింది.


Click it and Unblock the Notifications











