గన్ పేల్చి ఫ్యాన్స్‌కు ఖుషీ పంచిన కాజల్.. క్రేజీగా సత్యభామ రిలీజ్ డేట్.. విడుదల ఎప్పుడంటే?
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత ఎంచుకొంటున్న సినిమాలు తన అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఆసక్తిని పెంచేలా చేస్తున్నాయి. గ్లామర్, ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉండే పాత్రతో లేడీ ఓరియెంటెడ్ సినిమాగా వస్తున్న సత్యభామ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఈ చిత్ర రిలీజ్ డేట్, అలాగే మూవీ విశేషాల విషయానికి వస్తే..
సత్యభామ సినిమాకు గ్లింప్స్ మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. కాజల్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన ప్రమోషనల్ వీడియో అంచనాలు పెరిగేలా చేసింది. ఒక చేతికి గాజులు వేసుకొని వచ్చి ఇద్దరు నేరస్థులను కొట్టిన తీరుతో హీరోయిజం ఎలివేట్ చేసింది. అయితే నేరస్థులను నిజం చెప్పించడానికి కొట్టిన సమయంలో చేతికి రక్త రావడంతో.. గాజులు లేకుండా కొట్టాల్సింది మేడమ్ అంటూ కానిస్టేబుల్ అంటే.. లేకుండా కొడితే.. చెప్పారా? అంటూ కాజల్ చెప్పిన డైలాగ్స్ భారీగా పేలాయి.

కాజల్ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో నవీన్ చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను అవురమ్ ఆర్ట్స్ పతాకంపై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మేజర్ లాంటి ప్యాన్ ఇండియా మూవీని అందించిన దర్శకుడు శశికిరణ్ తిక్క సమర్పకుడిగా వ్యవహరించడమే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. క్రైమ్ థ్రిల్లర్ కథతో దర్శకుడు సుమన్ చిక్కాల రూపొందించారు.
సత్యభామ రిలీజ్ డేట్ ఆవిష్కరణను క్రియేటివ్‌గా రూపొందించారు. దీని కోసం ఓ కాన్సెప్ట్‌ను డిజైన్ చేశారు. ఒక సీన్ నుంచి రికవరీ చేసిన గన్ విడి పార్టులను ఒక్కొక్కటి లోడ్ చేసి.. కాజల్ షూట్ చేస్తుంది. అలా షూట్ చేసిన చేసిన బుల్లెట్ క్యాలెండర్‌లోని మే 17వ తేదీని హిట్ చేస్తుంది. ఆ తర్వాత ఈ సినిమాను మే 17న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
రిలీజ్ డేట్ ఆవిష్కరణ ఆసక్తికరంగా సాగింది. వారి క్రియేటివిటికీ నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తున్నది. తాజాగా ఈ సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. దాంతో కాజల్ కెరీర్‌లో మైలురాయిగా ఉండే సినిమా అనే అభిప్రాయం, అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
నటీనటులు: కాజల్ అగర్వాల్, ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర తదితరులు
బ్యానర్: అవురమ్ ఆర్ట్స్
స్క్రీన్ ప్లే, మూవీ ప్రెజెంటర్ : శశి కిరణ్ తిక్క
నిర్మాతలు: బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపెల్లి
కో ప్రొడ్యూసర్: బాలాజీ
సినిమాటోగ్రఫి: బి విష్ణు
సీఈవో: కుమార్ శ్రీరామనేని
సంగీతం: శ్రీ చరణ్ పాకాల
దర్శకత్వం: సుమన్ చిక్కాల


Click it and Unblock the Notifications











