Sarkaru Vaari Paata యూనిట్ కి షాక్.. ముందే లీకయిన 'కళావతి' సాంగ్!

ఈ మధ్యకాలంలో మైత్రి మూవీ మేకర్స్ వారిని లీకేజీల టెన్షన్ వదలడం లేదు పుష్ప సినిమా లీకేజ్ వ్యవహారం సహా ఆ ప్రొడక్షన్ లో జరుగుతున్న అనేక సినిమాలకు సంబంధించిన లీకేజీలు పెద్ద తలనొప్పిగా మారడంతో ఆ మధ్య పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. పోలీస్ కంప్తలయింట్ దాకా వెళ్ళిన తరువాత కూడా సర్కారు వారి పాట నుంచి విడుదల కావాల్సిన కళావతి పాట లీక్ కావడం సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

అంతా లేట్ లేట్ గా

అంతా లేట్ లేట్ గా

సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు. గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంక్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి సినిమా మీద భీభత్సమైన అంచనాలు ఏర్పడ్డాయి. లెక్క ప్రకారం ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉంది. కానీ మహేష్ బాబు కాలికి సర్జరీ జరగటం, కీర్తి సురేష్, మహేష్ బాబు కరోనా బారిన పడటం వంటి అనేక అంశాల కారణంగా సినిమా షూటింగ్ వాయిదా పడింది.

ఆసక్తి పెంచేలా

ఆసక్తి పెంచేలా

అయితే ఈ సినిమా ఎట్టకేలకు మే నెలలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. దీంతో సినిమా మీద ప్రేక్షకుల అంచనాలను మరింత పెంచేందుకు గాను సినిమా ప్రమోషన్స్ ఇప్పటి నుంచే మొదలు పెట్టారు మేకర్స్. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమా నుంచి మొదటి పాట విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే కొద్దిరోజుల నుంచి ఆ పాటకు సంబంధించిన పోస్టర్లు, ప్రోమో విడుదల చేస్తూ వచ్చారు.

పెద్ద దెబ్బే

పెద్ద దెబ్బే

కానీ అనూహ్యంగా 14వ తేదిన విడుదల చేయాల్సిన పాట సోషల్ మీడియాలో లీక్ అయింది. 14వ తేదీన విడుదల చేసి ఆ పాటతో యూట్యూబ్ రికార్డులు బద్దలు కొట్టాలని భావించిన సినిమా యూనిట్ కి ఇది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. అయితే పాట లీక్ అయిన కారణంగా పాటను ముందే విడుదల చేస్తారా? లేక చెప్పిన విధంగానే 14వ తేదిన విడుదల చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

ప్రోమోతో రికార్డు

ప్రోమోతో రికార్డు

ఇక కళావతి అంటూ సాగుతున్న ఈ పాట ప్రోమో ఇప్పటికే రికార్డు బద్దలు కొట్టింది. టాలీవుడ్ నుంచి 24 గంటలలో అత్యధిక వ్యూస్ సాధించిన ప్రోమోగానే కాకుండా అత్యధిక లైక్స్ సాధించిన ప్రోమోగా కూడా ఈ ప్రోమో నిలబడింది. మొత్తంమీద ప్రోమో పాట మీద ఆసక్తి పెంచింది. ఇక పాట వేరే లెవల్లో ఉంటుందని అభిమానులు అందరూ చాలా ఆశలు పెట్టుకొన్నారు కానీ అనూహ్యరీతిలో పాట లీక్ కావడంతో వారి ఆశలు అడియాశలు అయినట్లే.

Recommended Video

Mahesh Babu Fans Played Key Role In Hero Movie Blockbuster | Filmibeat Telugu
ఆ ఆశలు లేనట్టే?

ఆ ఆశలు లేనట్టే?

ఎందుకంటే పాట ముందు వచ్చినట్లయింది కానీ రికార్డులు బద్దలు కొడుతుంది అని భావించిన వారి ఆశలు మాత్రం గల్లంతైనట్లు అయింది. మరి ఈ లీకేజీ కి సంబంధించి సర్కారు వారి పాట యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాబోతుంది అనేది చూడాల్సి ఉంది. గతంలో ఇలా వరుస లీకేజీ టెన్షన్ కారణంగా పోలీసు కంప్లయింట్ కూడా ఇచ్చారు. ఈసారి ఏమి చేయనున్నారు అనేది చూడాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X